By: ABP Desam | Updated at : 20 Sep 2023 05:35 PM (IST)
Photo Credit: Pixabay
ప్రస్తుతం టెలీకాం కంపెనీలు అపరిమిత డేటా ఫ్లాన్స్ అందిస్తున్నాయి. వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ద్వారా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది స్మార్ట్ ఫోన్లలో డేటా ఈజీగా అయిపోతుంది. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డేటాను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
డేటా వినియోగాన్ని తరచుగా గమనించండి
మీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి డేటా వినియోగాన్ని తరచుగా గమనించాలి. అవసరాలకు అనుగుణంగా డేటాను ఉపయోగించుకోవాలి. స్మార్ట్ ఫోన్ ను తక్కువగా వినియోగించినా, డేటా త్వరగా అయిపోతే కస్టమర్ కేర్ ను సంప్రదించాలి. సమస్యను పరిష్కరించాలని కోరాలి.
ఇంటర్నెట్ డౌన్ లోడ్స్ తో జాగ్రత్త
ఇంటర్నెట్ నుంచి ఫైల్స్, సినిమాలను డౌన్‌లోడ్ చేయడం వలన పెద్ద మొత్తంలో డేటా అయిపోతుంది. కచ్చితంగా అవసరం అయితే తప్ప, డౌన్ లోడ్ చేయడం మానుకోండి. అవకాశం ఉంటే వైఫై ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.
ఆఫ్‌లైన్ మీడియా వినియోగాన్ని పెంచుకోండి
మీరు జర్నీలో ఉన్నప్పుడు Netflix, HBO Max వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మ్యూజిక్, వీడియో కంటెంట్ చూడాలి అనుకుంటే, Wi-Fiకి కనెక్ట్ అయినప్పుడు వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. నేరుగా వీడియోలను చూడటం ద్వారా డేటా అయిపోయే అవకాశం ఉంటుంది.
స్ట్రీమింగ్ క్వాలిటీని సెట్ చేసుకోండి
హై క్వాలిటీ స్ట్రీమింగ్ ద్వారా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, ఎక్కువ డేటా అయిపోతుంది. అందుకే వీడియోలు చూసే సమయంలో క్వాలిటీ కాస్త తగ్గించుకుంటే డేటాను కాపాడుకోవచ్చు.
వాట్సాప్ డౌన్‌లోడ్స్ ఆపండి
WhatsApp సహా మెసేజింగ్ యాప్స్ లో సాధారణంగా ఫోటోలు, వీడియోలు, డియో ఫైల్స్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్ కోసం డిఫాల్ట్ సెట్టింగ్‌లను కలిగి ఉంటాయి. మీరు Wi-Fiలో లేకుంటే మీ మొబైల్ డేటాను పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. అందుకే డౌన్‌లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చుకోవాలి. అవసరం అయితేనే, డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఆటోమేటిక్ యాప్ అప్‌డేట్స్ డిజేబుల్ చేయండి
తరచుగా యాప్ అప్‌డేట్స్ నోటిఫికేషన్లు వస్తాయి. వీటిని అప్ డేట్ చేయడం వల్ల ఎక్కువ డేటా అయిపోతుంది. వైఫై ఉన్న సమయంలోనే యాప్స్ ను అప్ డేట్ చేసుకోవడం మంచింది. అంతుకే ఆటోమేటిక్ యాప్స్ అప్ డేట్ ఆప్షన్ ను డిజేబుల్ చేయడం మంచిది.
నావిగేషన్ కోసం ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఉపయోగించండి
Google Maps లాంటి GPS నావిగేషన్ యాప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఎక్కువగా డేటా తీసుకుంటాయి. చాలా యాప్స్ ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. Wi-Fiకి కనెక్ట్ చేయబడినప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించడం ద్వారా డేటాను కాపాడుకోవచ్చు.
డేటా సేవింగ్ మోడ్‌ని యాక్టివేట్ చేయండి
చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు డేటా-సేవింగ్ మోడ్‌ను అందిస్తాయి. ఇది డేటా వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
5G కంటే 4Gకి ప్రాధాన్యత ఇవ్వండి
5G వేగంగా డేటా ఇస్తుంది. 4Gతో పోలిస్తే ఎక్కువ డేటా, బ్యాటరీని వినియోగిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ 5G, 4Gకి సపోర్టు చేస్తే, 4Gకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల డేటాను కాపాడుకోవచ్చు.
Read Also: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?
Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?
BGMI 2.9 Update Release Date: మోస్ట్ అవైటెడ్ బీజీఎంఐ 2.9 అప్‌డేట్ వచ్చింది - వావ్ అనిపిస్తున్న కొత్త గేమ్‌ప్లే!
Google Chrome: ఈ ఫోన్లు ఉపయోగిస్తున్నారా? - అయితే ఇక క్రోమ్ పని చేయదు!
Whatsapp New Feature: వాట్సాప్ ఛాట్లు హైడ్ చేసినా చూసేస్తున్నారా? - మీ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్!
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
/body>