Amazon Deal Alerts: ఈ ట్రిక్ ఫాలో అయితే అమెజాన్ సేల్‌లో ఆఫర్లు రాగానే తెలిసిపోతాయి!
అమెజాన్‌లో డీల్ అలెర్ట్స్ క్రియేట్ చేయడం ఎలా?
అమెజాన్ ప్రపంచంలోని అతిపెద్ద షాపింగ్ వెబ్‌సైట్‌లలో ఒకటి. భారతదేశంలో ఇది ఎలక్ట్రానిక్స్‌కు ప్రాధాన్యతనిస్తుంది. వెబ్‌సైట్ సందర్భానుసారంగా అనేక డీల్‌లను అందిస్తున్నప్పటికీ, అలెర్ట్స్ క్రియేట్ చేస్తే అమెజాన్ మొబైల్ యాప్ మీకు మెరుగైన డీల్‌లను అందిస్తుంది. అమెజాన్ పోటీ యాప్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మీరు ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌కు నోటిఫికేషన్ వచ్చే ఆప్షన్ ఉంటుంది
మీకు పర్సనలైజ్ చేసుకున్న డీల్ అలెర్ట్స్, యాప్‌లో మీ సెర్చ్‌ల ఆధారంగా డీల్ అలర్ట్‌ను రూపొందించడానికి Amazon మిమ్మల్ని అనుమతిస్తుంది. అమెజాన్‌లో డీల్ అలర్ట్ ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌లో మీ సెర్చ్ ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు కొంతకాలం క్రితం ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుని దాని కోసం చాలాసార్లు యాప్‌లో సెర్చ్ చేశారని అనుకుందాం. ఆ తర్వాత అమెజాన్ మీ కోసం డీల్ అలర్ట్‌ను సృష్టిస్తుంది. మీరు యాప్‌లో దాన్ని ఎనేబుల్ చేయవచ్చు.
ఇది మంచి ధరకు ప్రొడక్ట్‌ను పొందడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దాని గురించి చాలా మందికి తెలియదు.
మీ సెర్చ్ ఆధారంగా అమెజాన్‌లో డీల్ అలర్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి
స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ యాప్‌ని తెరవండి.
స్టెప్ 2: దిగువన కుడి వైపు ఉన్న హాంబర్గర్ చిహ్నంపై నొక్కండి.
స్టెప్ 3: అక్కడ ఉన్న ఆప్షన్లలో అకౌంట్స్‌ను నొక్కండి.
స్టెప్ 4: ఇప్పుడు మీకు మీ అకౌంట్ సంబంధించి అనేక ఆప్షన్లు కనిపిస్తాయి.
స్టెప్ 5: కిందకి స్క్రోల్ చేసి మెసేజ్ సెంటర్ సెక్షన్ కోసం చూడండి. అందులో డీల్ అలర్ట్‌లపై ట్యాప్ చేయండి.
స్టెప్ 6: మీకు ఇప్పుడు నాలుగు సెక్షన్లు కనిపిస్తాయి, ‘Your deal alerts,’ Get deal alerts,’ Available deals,’ ‘Upcoming deals.’ వీటిలో 'Get deal alerts'పై ట్యాప్ చేయండి. మీకు కొన్ని పర్సనలైజ్డ్ డీల్ ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడ మీరు ఒకదాన్ని ఎంచుకోవచ్చు, సృష్టించవచ్చు. మీరు ‘Create alert’పై నొక్కడం ద్వారా డీల్ అలర్ట్‌ని సృష్టించిన తర్వాత, వస్తువు అమ్మకానికి వచ్చినప్పుడు లేదా కొంత తగ్గింపు పొందినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా, మీరు ఈరోజు అందుబాటులో ఉన్న డీల్‌లను చూడటానికి ‘Available deals’ సెక్షన్‌ను చూడవచ్చు.
మీరు అమెజాన్‌లో మీకు ఇష్టమైన వస్తువు కోసం సులభంగా డీల్ అలర్ట్‌ని ఎలా క్రియేట్ చేయవచ్చు. ఆ వస్తువు అమ్మకానికి వచ్చినప్పుడు నోటిఫికేషన్ పొందవచ్చు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram