News
News
X

Redmi Buds 3 Lite: రెడ్‌మీ బడ్స్ 3 లైట్ వచ్చేశాయ్ - ధర ఎంతంటే?

రెడ్‌మీ బడ్స్ 3 లైట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది.

FOLLOW US: 

రెడ్‌మీ బడ్స్ 3 లైట్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో 6ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. షావోమీ సౌండ్ ల్యాబ్ ద్వారా వీటిని ట్యూన్ చేశారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వీ5.2 ఫీచర్లను అందించారు.

రియల్‌మీ బడ్స్ 3 లైట్ ధర
ప్రస్తుతం వీటి ధర మనదేశంలో రూ.1,999గా ఉంది. జులై 31వ తేదీన వీటి సేల్ జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మొదటి సేల్ సందర్భంగా 48 గంటల పాటు దీన్ని రూ.1,499గా నిర్ణయించారు.

రియల్‌మీ బడ్స్ 3 లైట్ స్పెసిఫికేషన్లు
ఇందులో ఇన్ ఇయర్ డిజైన్ అందించారు. కంపెనీ లాంచ్ చేసిన మొదటి డబుల్ టైర్డ్ సిలికాన్ ఇయర్‌బడ్స్ ఇవే. దీంతో ఇవి చెవుల్లో సెక్యూర్‌గా ఫిట్ కానున్నాయి. వీటిలో షావోమీ సౌండ్ ల్యాబ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన 6 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించారు.

బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఫీచర్ ఇందులో ఉంది. స్పష్టమైన కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్‌సీ) అందించారు. కేస్‌తో కలిపితే ఇవి 18 గంటల టైమ్‌ను అందించనున్నాయి.  కేవలం బడ్స్ మాత్రమే ఐదు గంటల పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.

ఈ కేసును యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా చార్జ్ చేయవచ్చు. 10 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 100 నిమిషాల మ్యూజిక్ ప్లేబ్యాక్ లభించనుంది. కనెక్టివిటీ, బ్యాటరీ స్టేటస్ కోసం ఎల్ఈడీ ఇండికేటర్స్‌ను అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ ఉంది. దీని బరువు 35 గ్రాములు మాత్రమే.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by mixiaomi_co (@mixiaomi_co)

Published at : 20 Jul 2022 09:08 PM (IST) Tags: Redmi Buds 3 Lite Price in India Redmi Buds 3 Lite Features Redmi Buds 3 Lite Launched Redmi Buds 3 Lite

సంబంధిత కథనాలు

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!

Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!

Google Warning: ‘గూగుల్’ ఉద్యోగుల్లో గుబులు - ఆ వార్నింగ్‌తో వణికిపోతున్న సిబ్బంది

Google Warning: ‘గూగుల్’ ఉద్యోగుల్లో గుబులు - ఆ వార్నింగ్‌తో వణికిపోతున్న సిబ్బంది

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?