స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!
ప్రతి అడుగును ట్రాక్ చేసే స్మార్ట్ వాచ్‌లు మనల్ని అనారోగ్యానికి దారితీస్తాయని మీకు తెలుసా? అవును మీరు చదివింది ముమ్మాటికి నిజమే..
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలిపే ఓ పరికరం అంతే. కానీ ఇప్పుడు వాచ్‌కు అర్థమే మారిపోయింది. స్మార్ట్ వాచ్‌ల రాకతో అన్ని మారిపోయాయి. మీ గుండె సరిగ్గా కొట్టుకుంటోందా.? రక్త ప్రసరణ సరిగ్గానే ఉందా.? ఆక్సిజన్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి.? ఇలా అన్ని విషయాలను తెలియజేస్తూ యూజర్లను అలర్ట్ చేస్తున్నాయి. అంతేనా వ్యాధులను ముందస్తుగానే గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తున్నాయి.
సరే ఇక్కడి వరకు అంతబాగానే ఉంది.. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన రోబో సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. అన్ని భాషల్లో రిలీజ్ అయి మాంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ స్మార్ట్ వాచ్ నుంచి సడెన్‌గా రోబో మూవీ ఎందుకు వచ్చిందంటే.. రీల్ కనెక్షన్‌కు రియల్ లైఫ్‌కు చాలా సంబంధం ఉందనే చెప్పలి. ఓ మనిషి తయారు చేసిన రోబో.. ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్‌లో అదే మనిషిని చంపేందు ప్రయత్నించడం రోబో మూవీలో చూశాం. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితే మనుషులకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు కొంత నిఫుణులు. నిన్నటి వరకు మన శరీరంలో ఏం జరుగుతుందా..? అన్న విషయాలను మనకు మనం తెలుసుకునేందుకు మార్కెట్‌లోకి వచ్చిన బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లను మనం కొంటున్నాం. కానీ అదే స్మార్ట్‌వాచ్ మన గురించి మనకు తప్పుడు సమాచారం ఇస్తుందన్న విషయాన్ని తెలుపుతుందన్న విషయం మీకు తెలుసా.? ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.
స్మార్ట్ వాచ్‌ల ముఖ్య ఉద్దేశ్యం:
బీపీ పెరిగినా, హార్ట్ బీట్ ఆందోళనకరంగా ఉన్నా, గుండెపోటు-పక్షవాతం వచ్చే ప్రమాదమున్నా తక్షణమే మనకు అలర్ట్ అందిస్తున్నాయి.సకాలంలో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకునేందుకు దోహదపడుతున్నాయి. లేదా మన అనారోగ్య సమాచారాన్ని మన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తున్నాయి. ఇలా అన్ని రకాల అత్యాధునిక ఫీచర్లు ఉన్న సరికొత్త స్మార్ట్ వాచ్ ప్రస్తుతం భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
స్మార్ట్ వాచ్‌లు శరీరానికి మేలు కంటే హానే ఎక్కువ:
మన ప్రతి అడుగును ట్రాక్ చేసే ఈ స్మార్ట్ వాచ్‌లు మనల్ని అనారోగ్యానికి దారితీస్తాయని మీకు తెలుసా? అవును మీరు చదివింది ముమ్మాటికి నిజమే.. ఫిట్‌నెస్‌ను లెక్కించడానికి మనం రోజంతా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించవచ్చు. ప్రతి విభాగంలో టార్గెట్ చేరుకున్నట్లు భావం మనకు రావొచ్చు. కానీ, ఈ స్మార్ట్ వాచ్‌లు మనలో ఒత్తిడి పెరిగించే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారుక వైద్యులు. అయితే స్మార్ట్‌వాచ్‌లు కేవలం వర్క్ అవుట్స్ చేసే సమయంలో మాత్రం ధరించడం మంచిదని హెచ్చరిస్తున్నారు ఫిట్‌నెస్ నిఫుణులు. అలా కాకుండా 24గంటల పాటు స్మార్ట్ వాచ్‌ను చేతికి ధరించడం కరెక్ట్ కాదని అన్నారు.
స్మార్ట్‌వాచ్‌లు నిజంగానే స్మార్టా..?
స్మార్ట్‌వాచ్‌ల ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే.. ఓ వ్యక్తి తన చేతికి స్మార్ట్ వాచ్‌ను ధరిస్తే.. అతడి బాడీలోని ప్రతి అప్‌డేట్‌ను సెకన్ టూ సెకన్ సదరు వ్యక్తి మొబైల్‌కి అందించాలి. వాటిలో బ్లేడ్ ప్రెజర్ కావొచ్చు, హార్ట్ బీట్ కావొచ్చు, అలాగే బీపీ కూడా కావొచ్చు. అయితే ఈ సమాచారం ఇవ్వడం ఒక్క ఎత్తు అయితే.. ఇచ్చే సమాచారం నిజమా..? కాదా..? అన్న విషయం తెలియల్సి ఉంది. కానీ కొంత యూట్యూబ్ బ్లాగర్స్‌లోని కొంత మంది మాత్రం.. స్మార్ట్ వాచ్‌ను చేతికి కట్టుకుంటే ఒకలా.. కాలుకు కట్టుకుంటే మరోలా అప్‌డేట్స్ ఇస్తుందని చెబుతున్నారు.
ఉదా: ఓ వ్యక్తి తన చేతికి ఓ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ వాచ్‌ను పెట్టుకుని, తన చేతులను జేబులో ఉంచి తను ముందుగానే నిర్దేశించుకున్న దూరానికి నడిచాడు. అందుకు ఒక రకమైన డిస్టెన్స్ క్యాలిక్యూలేషన్స్‌ను వెల్లడించింది స్మార్ట్ వాచ్. కానీ... ఇదే స్మార్ట్ వాచ్‌ను కాలుకు కట్టకుని, అదే దూరానికి నడిచాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. చేతికంటే.. కాలుకు పెట్టుకుని నడిస్తేనే కరెక్ట్ డిస్టెన్స్‌ను క్యాలిక్యూలేషట్ చేసింది స్మార్ట్ వాచ్.
స్మార్ట్‌వాచ్‌ను ఫేక్ ఆర్ రియల్ :
స్మార్ట్ వాచ్ ఫేక్ ఆర్ రియల్ అన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే.. గతంలో చాలా స్మార్ట్‌వాచ్‌ను ధరించిన వ్యక్తి రిస్క్‌ల్లో ఉన్న సందర్భాల్లో రెస్క్యూ చేసిన రియల్ సీన్లకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. గత నెల అక్టోబర్‌లో గర్భం దాల్చిన విషయం తాను గుర్తించక ముందే యాపిల్ వాచ్ సూచించిందని సదరు మహిళ పేర్కొంది. తన యావరేజ్ రెస్టింగ్ హార్ట్ రేట్ కొన్ని రోజులలో గణనీయంగా పెరిగినట్లు యాపిల్ వాచ్ చూపించిందని ఆమె తెలిపారు. యావరేజ్ రెస్టింగ్ హార్ట్ రేట్ పెరగడం చూసి శరీరంలో ఏవో మార్పులు జరిగినట్లు అనుమానించినట్లు సదరు మహిళ పోస్ట్‌లో పేర్కొన్నారు.