News
News
X

Fire Boltt Ninja Bell: రూ.4 వేలలోపే సూపర్ స్మార్ట్ వాచ్ - 25 రోజుల బ్యాటరీ బ్యాకప్!

ప్రముఖ టెక్ కంపెనీ ఫైర్ బోల్ట్ మనదేశంలో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. అదే ఫైర్ బోల్ట్ నింజా బెల్.

FOLLOW US: 

ఫైర్ బోల్ట్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఫైర్ బోల్ట్ నింజా బెల్. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంది. ఇందులో మెటల్ కేస్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌ను కూడా ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది. ఏకంగా 60 స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఫైర్ బోల్ట్ నింజా బెల్ స్మార్ట్ వాచ్ ధర
దీని ధరను రూ.3,499గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, బ్లూ, గ్రే, రోజ్ గోల్డ్, డార్క్ మవు రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,999తో లిస్ట్ అయింది. ఇది ప్రారంభ ఆఫర్ అని చెప్పవచ్చు.

ఫైర్ బోల్ట్ నింజా బెల్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు
ఈ స్మార్ట్ వాచ్ వాయిస్ అసిస్టెంట్‌తో రానుంది. డయల్ ప్యాడ్, కాల్ హిస్టర్, సింక్ కాంటాక్ట్స్ వంటివన్నీ వినియోగదారులు దీని ద్వారా చేయవచ్చు. 1.69 అంగుళాల టచ్ స్క్రీన్ ఎల్సీడీ డిస్‌ప్లే కూడా ఇందులో అందించారు. దీని రిజల్యూషన్ 240 x 280 పిక్సెల్స్‌గా ఉంది.

ఈ వాచ్ ద్వారా వినియోగదారులు ఫోన్ తీయకుండానే కాల్స్ ఆన్సర్ చేయవచ్చు. స్మార్ట్ వాచ్ నుంచే పాటలు కూడా వినవచ్చు. దీంతోపాటు స్ప్లిట్ డిస్‌ప్లే ఈజీ యాక్సెస్ కూడా ఉంది. దీని ద్వారా మెనూలో సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఒక్క క్లిక్‌తో తమకు కావాల్సిన ఫంక్షన్‌ను ల్యాండ్ చేయవచ్చు.

ఐపీ68 వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. చెమట, వాన చినుకులు పడినా ఈ ఫోన్‌కు ఏమీ కాదన్న మాట. వాచ్ ద్వారా కెమెరా కంట్రోల్ చేయడం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం, స్మార్ట్ నోటిఫికేషన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ పెడితే 25 రోజుల పాటు ఈ వాచ్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ వాచ్ మీ హార్ట్ రేట్‌ని 24 గంటల పాటు మానిటర్ చేయగలదు. అలాగే ఎస్‌పీఓ2 ట్రాకర్ కూడా ఉంది. 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది ట్రాక్ చేయనుంది. 100 వాచ్ ఫేసెస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 26 Jun 2022 10:54 PM (IST) Tags: Fire Boltt Ninja Bell Price in India Fire Boltt Ninja Bell Fire Boltt Ninja Bell Features Fire Boltt Ninja Bell Specifications Fire Boltt Ninja Bell Smartwatch

సంబంధిత కథనాలు

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!

Moto Tab G62: మోటొరోలా కొత్త ట్యాబ్ వచ్చేసింది - తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లే!

Google Warning: ‘గూగుల్’ ఉద్యోగుల్లో గుబులు - ఆ వార్నింగ్‌తో వణికిపోతున్న సిబ్బంది

Google Warning: ‘గూగుల్’ ఉద్యోగుల్లో గుబులు - ఆ వార్నింగ్‌తో వణికిపోతున్న సిబ్బంది

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం