Boat Wave Neo: రూ.1,800లోపే అదిరిపోయే స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన భారతీయ బ్రాండ్!
భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ కొత్త బడ్జెట్ స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది.
భారతీయ బ్రాండ్ బోట్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 1.69 అంగుళాల టచ్ డిస్‌ప్లే, ఎస్‌పీఓ2 మానిటర్, హార్ట్ రేట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏడు రోజుల బ్యాకప్‌ను ఇది అందించనుంది.
బోట్ వేవ్ నియో ధర
దీని ధరను రూ.1,799గా నిర్ణయించారు. మే 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ జరగనుంది. బ్లాక్, బ్లూ, బర్గండీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌కు 12 నెలల వారంటీ అందించనున్నారు.
బోట్ వేవ్ నియో ఫీచర్లు
ఇందులో 1.69 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 454 x 454గా ఉంది. 2.5డీ కర్వ్‌డ్ స్క్రీన్, 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు కూడా ఈ వాచ్‌లో అందించారు. వాచ్ ఫేస్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ వాచ్2లో ఎస్‌పీఓ2 సెన్సార్ కూడా ఉంది. బ్లడ్ శాచురేషన్, హార్ట్ రేట్ సెన్సార్లను కూడా అందించారు. దీంతోపాటు స్ట్రెస్ మానిటరింగ్ ట్రాకర్ ద్వారా స్ట్రెస్‌ను కూడా కాలిక్యులేట్ చేయవచ్చు. దీంతోపాటు కాల్స్, టెక్స్ట్స్, నోటిఫికేషన్లను కూడా పొందవచ్చు.
వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, హైకింగ్, యోగా, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా అందించారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌లకు దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 4.4, ఐవోఎస్ 8.0 ఆ పైన వెర్షన్లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని బరువు కేవలం 35 గ్రాములు మాత్రమే ఉంది. ఫ్రీ సైజ్ సిలికాన్ స్ట్రాప్‌ను దీంతోపాటు అందించారు. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే... ఒక్కసారి చార్జింగ్ పెట్టి ఏడు రోజుల పాటు ఉపయోగించవచ్చు. ఐపీ68 డస్ట్, స్వెట్, స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram