Flipkart Apple Offers: ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు!
Flipkart Offers: ఫ్లిప్‌కార్టులో యాపిల్ ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Flipkart Big Upgrade Days Sale: మీరు ఐఫోన్ లేదా మరేదైనా యాపిల్ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్ మీకు బెస్ట్ ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఇది మార్చి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో యాపిల్ ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో ఏ యాపిల్ ఉత్పత్తులు ఆఫర్‌లను పొందుతున్నాయో తెలుసుకుందాం.
యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 (Apple MacBook Air M1)
యాపిల్ లాంచ్ చేయనున్న ఈ మ్యాక్‌బుక్ ధర రూ.లక్షగా ఉంది. దీనిపై రూ. 31,910 తగ్గింపును అందిస్తున్నారు. ఇప్పుడు దీని ధర రూ. 67,990గా ఉంది. ఇది కాకుండా మీరు ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే. ఈఎంఐ ద్వారా మీరు రూ.3,500 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీంతో మ్యాక్‌బుక్ ధర మీకు రూ. 64,490 అవుతుంది.
యాపిల్ రెండో తరం ఎయిర్‌పోడ్‌లు
ఈ ఎయిర్‌పోడ్‌ల ధర రూ.12,900 అయినప్పటికీ ఇప్పుడు రూ.4,401 తగ్గింపుతో రూ. 8,499కి అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌ను ద్వారా అదనంగా మరో రూ. 1,500 తగ్గనుంది. అంటే వీటిని రూ. 6,999కి కొనుగోలు చేయవచ్చన్న మాట.
యాపిల్ వాచ్ సిరీస్ 9
యాపిల్ లాంచ్ చేసిన ఈ వాచ్ సిరీస్‌పై రూ. 8,901 తగ్గింపును అందిస్తున్నారు. కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఈఎంఐ చెల్లింపుపై రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. ఇది వాచ్ ధరను రూ. 30,999కి తగ్గిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 15
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 15పై కూడా భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.13,401 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈఎంఐ చెల్లింపుపై కొనుగోలు చేస్తే మీకు రూ. 1,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీని తర్వాత ఐఫోన్ 15 ధర రూ. 64,999గా ఉంటుంది.
యాపిల్ ఐప్యాడ్ 9వ జెన్
యాపిల్ ఐప్యాడ్ 9వ జెన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 7,901 తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడు ఈ ఐప్యాడ్ ధర రూ. 24,999గా ఉంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్‌ను కూడా ఉపయోగిస్తే మీరు దీన్ని రూ. 23,499కి కొనుగోలు చేయగలుగుతారు.