Fastest Router of India: దేశంలోనే అత్యంత వేగవంతమైన రూటర్ - సెకనుకు 2,400 జీబీ స్పీడ్‌తో!
Fastest Router: భారతదేశంలో అత్యంత వేగవంతమైన రూటర్ లాంచ్ అయింది.
India Fastest Router: భారతదేశ ఎలక్ట్రానిక్స్ టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ దేశంలోనే వేగవంతమైన రూటర్‌ను ప్రారంభించారు. ఈ రూటర్ సామర్థ్యం 2.4 టీబీపీఎస్‌గా ఉంది. అంటే 2,400 జీబీపీఎస్ అన్నమాట. ఈ రూటర్ టెలికాం డిపార్ట్‌మెంట్, సీడీవోటీ, భారత ప్రభుత్వ నివేతి సిస్టమ్ సహాయంతో పూర్తిగా మన దేశంలోనే తయారు అయింది. అశ్విని వైష్ణవ్ ఈ భారతీయ నిర్మిత రూటర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్‌లో ప్రధాన ప్రోత్సాహకం అని తెలిపారు.
డిజిటల్ ఇండియా ప్రయత్నాలకు నెట్‌వర్కింగ్ కీలకమని అందరికీ తెలుసని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. పూర్తిగా భారతదేశంలో తయారైన ఈ రూటర్ నెట్‌వర్కింగ్ ప్రక్రియలో చాలా ముఖ్యమైనదని తెలిపారు. నెట్‌వర్కింగ్ కోసం ఇలాంటి కోర్ రూటర్ల అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ రకమైన రూటర్ భారతదేశంలో తయారు అయినందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
భారతదేశపు అత్యంత వేగవంతమైన రూటర్ ఇదే
భారతదేశంలోనే వేగవంతమైన రూటర్ స్పీడ్ 2.4 టీబీపీఎస్‌గా ఉంది. ఒక టెరాబైట్ అంటే 1000 గిగాబైట్‌లు, ఒక ట్రిలియన్ బైట్‌లకు సమానం. ఈ రూటర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, రైల్వే కమ్యూనికేషన్ నెట్‌వర్క్, టెలివిజన్ రంగంలో అనేక విభాగాలను అభివృద్ధి చేయవచ్చు.
ఎంపీఎల్ఎస్ అనేది ఒక రూటింగ్ టెక్నిక్. దీన్ని టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఒక నోడ్ నుంచి మరొక నోడ్‌కి డైరెక్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఉపయోగిస్తారు. ఈ విధానంతో నెట్‌వర్కింగ్ టెక్నాలజీ బూస్ట్ అయింది. అంతేకాకుండా డిజిటల్ ఇండియాలో మౌలిక సదుపాయాలు కూడా పెరిగాయి.
మరింత వేగం పుంజుకోనున్న నెట్‌వర్క్
ఈ మల్టీప్రొటోకాల్ లేబుల్ స్విచింగ్‌ను (ఎంపీఎల్ఎస్) మొదటిసారిగా 1990 సంవత్సరంలో కనిపెట్టారు. ఇది నెట్‌వర్క్ కనెక్షన్‌ను ప్రీడిటైర్మైన్డ్ పాత్‌లో పంపడం ద్వారా నెట్ వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎంపీఎల్ఎస్ నెట్‌వర్క్ మార్గాన్ని ముందుగానే పర్యవేక్షిస్తుంది. ఇది డేటా ట్రాన్స్‌ఫర్‌కు పట్టే సమయాన్ని తగ్గిస్తుంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?