CERT In: క్రోమ్ యూజర్లకు గవర్నమెంట్ వార్నింగ్ - వెంటనే అలా చేయాలంట!
Google Chrome Threat: గూగుల్ క్రోమ్ యూజర్లకు భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించింది.
Google Chrome Security: మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని కూడా ఉపయోగిస్తున్నట్లు అయితే జాగ్రత్తగా ఉండాలి. భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) భారతదేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ వార్నింగ్‌ను జారీ చేసింది. బ్రౌజర్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో అనేక లోపాలు కనుగొన్నారు. ఇది యూజర్ డేటా, సిస్టమ్ స్టెబిలిటీకి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు మీ సిస్టమ్‌ను నియంత్రించగలరు. హ్యాకర్లు ప్రమాదకరమైన కోడ్‌ని రన్ చేయవచ్చు లేదా మీ డివైస్‌ని క్రాష్ చేయవచ్చు. ఈ లోపాలు 131.0.6778.139, 131.0.6778.108 కంటే ముందు విడుదలైన విండోస్, మ్యాక్‌ఓఎస్, లైనక్స్ కోసం క్రోమ్ అప్‌డేట్స్‌లో కనిపిస్తాయి. కాబట్టి మీ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయడం మంచిది.
ప్రమాదం ఏమిటి?
వాస్తవానికి గూగుల్ క్రోమ్‌లో తీవ్రమైన లోపాలు కనుగొన్నారు. వీటిలో బ్రౌజర్ వీ8 ఇంజిన్‌లో "టైప్ కన్ఫ్యూజన్", దాని ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌లో బగ్ ఉన్నాయి. ప్రమాదకరమైన కోడ్‌ను రిమోట్‌గా ఎడిట్ చేసి లేదా డీవోఎస్ ద్వారా దాడిని చేయడానికి హ్యాకర్లు ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చు. ఇది మీ సిస్టమ్‌ను కూడా క్రాష్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి గూగుల్ క్రోమ్‌ను మీరు వెంటనే అప్‌డేట్ చేయడం మంచిది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
ఏ సిస్టంలకు ప్రమాదం ఉంది?
విండోస్, మ్యాక్ఓఎస్ లేదా లైనక్స్‌లో గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లను ఉపయోగించే ఎవరైనా ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉన్నారు. 131.0.6778.139 లేదా 131.0.6778.108 కంటే ముందు బ్రౌజర్ వెర్షన్‌లను కలిగి ఉన్నవారు కూడా ప్రమాదంలో ఉన్నారు.
ప్రమాదం బారిన పడకుండా ఉండటం ఎలా?
వినియోగదారులందరూ తమ బ్రౌజర్‌లను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయాలని సెర్ట్ ఇన్ సూచించింది. ఈ లోపాలను పరిష్కరించడానికి గూగుల్ ఇప్పటికే ఒక ప్యాచ్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి మీరు ఈ ప్రక్రియను అనుసరించవచ్చు.
1. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
2. అనంతరం కుడివైపు ఎగువ మూలకు వెళ్లి మెనూపై క్లిక్ చేయండి.
3. దీని తర్వాత హెల్ప్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి, ఆపై క్రోమ్ గురించి చెక్ చేయండి.
4. దీని తర్వాత బ్రౌజర్ అప్‌డేట్స్ కోసం చెక్ చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు దాన్ని రీలాంచ్ చేయవచ్చు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Safety tip : Regularly update apps.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scamming #cyberalert #CSK #CyberSecurityAwareness pic.twitter.com/d5VGBrLjXh
— CERT-In (@IndianCERT) December 20, 2024
CERT-In has released an awareness booklet for Digital Nagriks and Digital Enterprises on 'National Cyber Security Awareness Month'#SatarkNagrik #secureourworld #indiancert #CyberAwareness #NCSAM #cyberswachhtakendra #staysafeonline #mygov #Meity #NCSAM2024 #ISEA #digitalindia pic.twitter.com/mYtDmfk4Y2
— CERT-In (@IndianCERT) October 1, 2024