AI Software Engineer: కోడింగ్ తెలియకుండానే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారగలరా? AI సహాయపడుతుందా?
అన్ని విభాగాల్లో దూసుకుపోతున్న ఏఐ.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లను కూడా భర్తీ చేయగలదా? అనే చర్చ సాగుతోంది. కోడింగ్ ఎలా చేయాలో తెలియకుండానే ఎవరైనా డెవలపర్‌గా మారొచ్చా? మరి ఇది సాధ్యమవుతుందా..! చూద్దాం రండి.

By Saket Newaskar
Artificial Intelligence: మానవ జీవితాల్లో వ్యక్తిగతంగా వృత్తిపరంగా అనేక మార్పులను తీసుకొస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI). ఏఐ సహాయక సాధనాలు ప్రస్తుతం కోడ్‌ను రాసేస్తున్నాయి. ఆప్టిమైజ్, డీబగ్ చేయగలుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసి గతంలో కంటే నాణ్యతతో అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలా అన్ని విభాగాల్లో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లను కూడా భర్తీ చేయగలదా? అనే చర్చ, భయం మొదలైంది. కోడింగ్ ఎలా చేయాలో తెలియకుండానే ఎవరైనా డెవలపర్‌గా మారొచ్చా? అనే అంశంపైనా తీవ్ర చర్చ సాగుతోంది. మరి ఇది సాధ్యమవుతుందా..! చూద్దాం రండి.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోడ్‌ను జనరేట్ చేయడమే కాదు.. దాన్ని మెరుగుపరచగలదు కూడా. ఇందుకోసం ఏఐ సామర్థ్యాలను అనేక సంస్థలు వివిధ మార్గాల్లో ఉపయోగించుకుంటున్నాయి. ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాల్లో ఆటోనామస్ వెహికల్స్, ఏవియానిక్స్ సాఫ్ట్‌వేర్‌లలో ఎంబెడెడ్ సిస్టమ్‌ల కోసం ఆటోమేటెడ్ కోడ్ టెస్టింగ్‌లో AI సహాయపడుతోంది. BFSIలో, AI కంప్లైయన్స్–రెడీ ఫైనాన్షియల్ అప్లికేషన్లను రూపొందించడంలో దోహదపడుతోంది. కానీ రిస్క్ మేనేజ్‌మెంట్ విషయంలో మ్యాన్ పవర్ ఎంతైనా అవసరం ఉంది. తయారీతోపాటు పారిశ్రామిక ఆటోమేషన్‌లో AI ప్రాథమిక నియంత్రణ వ్యవస్థ కోడ్‌ను రాయగలదు. కానీ అది సమర్థంగా పనిచేస్తుందా? లేదా? అని నిర్ధారించుకునేందుకు మానవ నైపుణ్యం ఇప్పటికీ అవసరమే. కోడింగ్ తెలియకుండా సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారలేం..
లో కోడ్ తోపాటు నో కోడ్ ప్లాట్‌ఫారమ్‌లలో డెవలపర్లు కానివారు కూడా అప్లికేషన్లను రూపొందించేందుకు అనుమతి ఉంటుంది. కానీ సంక్లిష్టమైన, స్కేలబుల్, సెక్యూర్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. సిస్టమ్ ఆర్కిటెక్చర్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సెక్యూరిటీని అర్థం చేసుకునే మానవ ఇంజనీర్లు మనకు అవసరం. ఈ గ్యాప్‌ను AI ఎట్టిపరిస్థితుల్లోనూ పూరించలేదు.
సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో కష్టమైన పని కోడ్ రాయడం కాదు.. ఏమి రాయాలో, ఎందుకు రాయాలో దాన్ని రాయడం అవసరమా అని నిర్ధారించుకోవడం. AI ప్రాజెక్ట్ మేనేజర్లతో మాట్లాడి ఒక ఫీచర్‌ను ఎందుకు జోడించాలో, జోడించకూడదో తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ లేదా వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషింగలగలాలి. సవాళ్లు తలెత్తే ముందే పసిగట్టాలి. ఈ పనులను ఏఐ చేయలేదు. AI గొప్ప టూల్ ఏ అయినప్పటికీ.. అంతర్ దృష్టి, దృష్టి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దానికి లేదు. ఇందుకు మ్యాన్ పవర్ కచ్చితంగా ఉండాల్సిందే.
* AI ఈ పనులు చేయలేదు
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్యాటర్న్‌ను అంచనా వేయగలదు కానీ వ్యాపార లక్ష్యాలు, పరిశ్రమ నిర్దిష్ట సవాళ్లను గ్రహించలేదు. సమర్థవంతమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైన అంశం.
* AI ఉత్పత్తి చేసిన కోడ్ సామర్థ్యంతోపాటు మాడ్యులారిటీని కలిగి ఉండదు. భారీ స్థాయి అప్లికేషన్ల కోసం దాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు మానవ జోక్యం అవసరం.
* ఇప్పటికే ఉన్న నమూనాల ఆధారంగా AI కోడ్‌ను జనరేట్ చేయగలదు. కానీ దానికి సృజనాత్మకత, సంచలనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేసే సామర్థ్యం లేదు.
* ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉత్పత్తి చేసిన కోడ్‌ను తనిఖీ చేయకుండా వదిలేస్తే దుష్పరిణామాలు చవిచూసే అవకాశాలున్నాయి.
రానున్న దశాబ్ద కాలంలో కోడింగ్ రంగంలో AI దూసుకుపోయే అవకాశం ఉన్నప్పటికీ.. అదే స్థాయిలో సాఫ్ట్‌వేర్ కూడా అభివృద్ధి చెందుతుంది. దాన్ని మ్యానేజ్ చేయడానికి, స్కేల్ చేయడానికి మరింత నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు (మ్యాన్ పవర్) అవసరం ఉంటుంది.
(The author is the Director & Head of Transformation, Expleo)
Disclaimer: The opinions, beliefs, and views expressed by the various authors and forum participants on this website are personal and do not reflect the opinions, beliefs, and views of ABP Network Pvt. Ltd.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

