BSNL Best Plan: 600 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ - బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్ - నెలకు రూ.166కే!
BSNL Best Prepaid Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మంచి వార్షిక ప్లాన్‌ను అందిస్తుంది. అదే రూ.1999 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ఏకంగా 600 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందించనుంది.
Jio Vs BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గత కొద్ది కాలం నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్ఎల్ కేవలం ఒక నెలలోనే లక్షలాది మంది కొత్త కస్టమర్లను సంపాదించింది. భారతదేశంలోని మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 2024 జూలైలో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచాయి.
ప్రైవేటు టెలికాం సంస్థలు ధరలు పెంచడంతో దేశవ్యాప్తంగా వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడింది. వారి రీఛార్జ్ ప్లాన్‌లు ఏకంగా 20 నుంచి 30 శాతం వరకు ఖరీదైనవిగా మారిపోయాయి. దీంతో కోట్లాది మంది కస్టమర్లలో ఆగ్రహం పెరిగిపోయింది. బీఎస్ఎన్ఎల్ దీన్ని తనకు ఒక పెద్ద అవకాశంగా భావించింది. తన చవకైన ప్లాన్ల వైపు ప్రజలను ఆకర్షించడం ప్రారంభించింది.
బీఎస్ఎన్ఎల్ ఈ ప్రయత్నం నుండి ప్రయోజనం పొందింది కూడా. గత నెలలోనే లక్షల మంది కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. మూడు ప్రైవేట్ కంపెనీలను వదిలి బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరిన కస్టమర్లు చాలా మంది ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ తన 4జీ కనెక్టివిటీని దేశవ్యాప్తంగా విస్తరించడానికి, బీఎస్ఎన్ఎల్ 5జీ కనెక్టివిటీపై కూడా వేగంగా పని చేయడం ప్రారంభించింది.
2025 చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ ప్రారంభం అవుడుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ సమయంలో వినియోగదారులు బీఎస్ఎన్‌ఎల్‌కు సంబంధించిన అనేక చవకైన ప్లాన్ల కోసం చూస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ వద్ద ఒక మంచి వార్షిక ప్లాన్ ఉంది. దీని ద్వారా మీరు సంవత్సరం ఈ ప్లాన్‌ను ఉపయోగించవచ్చు. అలాగే చాలా డబ్బు కూడా ఆదా చేయవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
నెలకు రూ.166 మాత్రమే...
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ.1999గా ఉంది. దీని వ్యాలిడిటీ మాత్రం ఏకంగా 365 రోజులు ఉండటం విశేషం. ఈ ప్లాన్‌తో వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా 600 జీబీ హై స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత ఉచిత కాలింగ్ పొందుతారు. వినియోగదారులు డైలీ లిమిట్ లేకుండా ఈ డేటాను పొందుతారని గుర్తుంచుకోవాలి. అవసరం అనుకుంటే ఒక్క రోజులోనే 100 జీబీ మొత్తం వాడేయవచ్చు. లేదా ఏమీ వాడకపోయినా మీకు కలిగే డేటా లాస్ ఏమీ ఉండదు. అంటే నెలకు కేవలం రూ.166కే మంచి ప్లాన్ పొందవచ్చన్న మాట.
జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇలా...
రిలయన్స్ జియో రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇది రోజుకు 1.5 జీబీ డేటా, 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. అదే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం ఎయిర్‌టెల్ నెలకు రూ. 349 వసూలు చేస్తుంది. బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌ని తీసుకునే వినియోగదారులు ఎంత ప్రయోజనం పొందగలరో ఇప్పుడు మీరే ఊహించవచ్చు. అయితే బీఎస్ఎన్ఎల్‌కి కాస్త నెట్‌వర్క్ సమస్య ఉంది. కానీ రాబోయే కాలంలో దాని కనెక్టివిటీని మెరుగుపరుచుకుంటే ఇది కచ్చితంగా అన్ని ప్రైవేట్ కంపెనీలకు పెద్ద టెన్షన్‌గా మారవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?