అన్వేషించండి

Best Gaming Mobiles: బెస్ట్ గేమింగ్స్​ ఫోన్స్​ కొనాలనుకుంటున్నారా? - అతి తక్కువ బడ్జెట్​ స్మార్ట్​ ఫోన్స్​ ఇవే!

Best Gaming Mobile Phones | గేమ్స్ ఆడేందుకు హై స్పీడ్ ప్రాసెసర్​ కలిగిన ఓ మంచి స్మార్ట్‌ఫోన్ కావాలా.. రూ. 25,000 బడ్జెట్​లో మంచి గేమింగ్ అనుభూతిని అందించే బెస్ట్ గేమింగ్​ ఫోన్ల లిస్ట్ ఇదే!

Best Gaming Smart Phones Under 25000 K | గేమ్స్ ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడే వారికి హై స్పీడ్ ప్రాసెసర్​ కలిగిన ఓ మంచి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. లేదంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంటుంది. మరి  బడ్జెట్​లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని మీరు  అనుకుంటున్నారా? అందుకే మీ కోసం  రూ.25,000 బడ్జెట్​లో  మంచి గేమింగ్ అనుభూతిని అందించే బెస్ట్ గేమింగ్​ ఫోన్ల లిస్ట్​ను తీసుకొచ్చాం. అవేంటో తెలుసుకుందాం..

Poco X6 Pro - పోకో ఎక్స్​6 ప్రో  6.67 ఇంచ్ AMOLED డిస్​ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్​, 1800 నిట్స్ పీక్‌​ బ్రైట్​నెస్​, IP54 రేటింగ్​ను కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌ ఉపయోగించారు. గ్రాఫిక్స్ టాస్క్​ల కోసం Mali-G615 GPU కూడా ఉంది. ఇంకా 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్​  కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. షియోమి హైపర్ ఓఎస్​తో పాటు​ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్​ను ఆపరేట్​ చేయగలదు. ఇన్​ డిస్​ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్లు ఉన్నాయి. 


OnePlus Nord CE 4 - వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఓఎస్‌తో నడుస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ +  అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటును కలిగి ఉంది.  స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్​ కోసం Adreno 720 GPUను కూడా ఇచ్చారు.  వెనకవైపు 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్‌ను ఇవ్వగా, ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌ చేస్తుంది.  8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 355 అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా కూడా ఉంది. ముందువైపు   16 ఎంపీ కెమెరా కూడా ఇచ్చారు. ఇంకా 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 100W సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

Infinix GT 20 Pro - మిడ్-రేంజ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 8200-Ultimate చిప్‌సెట్‌పై నడుస్తుంది. అలానే 8GB ర్యామ్/ 256GB స్టోరేజ్ కెపాసిటీ ఉంది.  5,000 mAh బ్యాటరీ సెటప్‌ కూడా కలిగి ఉంది. సులభంగా ఫాస్ట్ ఛార్జ్‌ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జన్‌ను అందిస్తోంది. ఇంకా 6.78 ఇంచ్ ఫుల్ హెచ్​డీ,​ LTPS అమోఎల్ఈడీ డిస్​ప్లే,  144Hz  స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్​ బ్రైట్​నెస్​ను కలిగి ఉంది.

మంచి గేమింగ్ అనుభవం కోసం మెరుగైన డిస్​ప్లేను అందించడానికి ఎక్స్ 5 టర్బో చిపను, ఇంటిగ్రేట్ చేయడానికి పిక్సెల్ వర్క్స్​తో కలిసి పనిచేయనుంది.  ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఇన్ఫీనిక్స్ ఎక్స్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై ఈ స్మార్ట్​ఫోన్ నడుస్తుంది. ​ఇంకా, ఇన్ఫీనిక్స్ రెండు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్​గ్రేడ్స్​, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్​లను అందిస్తుంది. దీని ధర రూ.24,999 నుంచి ప్రారంభం.

Nothing Phone 2a - నథింగ్ ఫోన్ 2a  మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్​సెట్​ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్,  256GB ఇంటర్నేల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది.  6.7 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోఎల్ఈడీ డిస్ల్పేను  ఇందులో అమర్చారు. 1300 నిట్స్ బ్రైట్ నెస్​తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్​ను కూడా కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్,  32 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉన్నాయి.  5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. డ్యూయెల్ స్టీరియో స్పీకర్ సెటప్​, రెండు హెచ్ డీ మైక్రోఫోన్స్ కూడా  అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్​ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టమ్​పై నడుస్తుంది.  అలానే రెండు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్​గ్రేడ్స్​, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్​లను అందిస్తుంది. దీని ధర రూ. 23, 999. 

Motorola Edge 50 Fusion - మోటోరోలా ఎడ్జ్​ 50 ఫ్యూజన్  6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, పోలెడ్ కర్వ్​ డిస్‌ప్లే, ప్రొటెక్షన్ కోసం  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5  డిస్‌ప్లేను కలిగి ఉంది. హై రిఫ్రెష్ రేట్ 144హెచ్‌జెడ్ 1,600 నిట్స్​ బ్రైట్​నెస్​తో పనిచేస్తుంది. క్వాల్​కామ్ స్నాప్​ డ్రాగన్  7ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్‌తో  మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. ఇంకా 5జీ, 4జీ  LTE, వైఫై 6, బ్లూటూత్​ 5.2, జీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, ఇన్​డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్  వంటి ఫీచర్లు  కూడా ఉన్నాయి.  కెమెరా విషయానికొస్తే 50ఎంపీ సోనీ-లైటియా 700సి ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌, డివైజ్ సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ సెల్ఫీ షూటర్‌ కూడా ఉంది.  68 డబ్ల్యూ టర్బో‌పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉంది. 12GB LPDDR4X ర్యామ్​, 256 GB, 2.2UFS స్టోరేజ్ కెపాసిటీతో పనిచేస్తుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది -  ఇది దృశ్యం కాదు అదృశ్యం !
శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Kiran Abbavaram: చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
Embed widget