Asus 8Z India Launch: అసుస్ 8జెడ్ వచ్చేస్తుంది - టాప్ ఎండ్ ఫీచర్లు - ధర ఎంత ఉండనుందంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ మనదేశంలో తన కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. అదే అసుస్ 8జెడ్. ఈ ఫోన్ ధర రూ.50 వేల రేంజ్‌లో ఉండనుంది.
Asus 8Z: అసుస్ 8జెడ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఫిబ్రవరి 28వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది.
అసుస్ జెన్‌ఫోన్ 8 (Asus Zenfone 8) సిరీస్ గతేడాది మేలో గ్లోబల్ లాంచ్ అయింది. అసుస్ జెన్‌ఫోన్ 8 స్మార్ట్ ఫోన్ మనదేశంలో అసుస్ 8జెడ్‌గా లాంచ్ కానుంది. గ్లోబల్ లాంచ్ అయిన ఎనిమిది నెలల తర్వాత ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అసుస్ మిలింద్ సోమన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
నిజానికి అసుస్ గ్లోబల్ లాంచ్ అయిన కొద్ది రోజులకే మనదేశంలో లాంచ్ కావాల్సి ఉంది. అయితే కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఈ లాంచ్ వాయిదా పడింది. ఈ ఫోన్ ఇప్పుడు మనదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్‌గా 599 యూరోల (సుమారు రూ.53,200) ధరతో లాంచ్ అయింది. మనదేశంలో దీని ధర అంతకంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
అసుస్ 8జెడ్ స్పెసిఫికేషన్లు (Asus 8Z Specifications)
ఇందులో 5. 9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్‌ను అందించనున్నారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 363 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్663 సెన్సార్ అందుబాటులో ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!