అన్వేషించండి

Claude Mythos in India: భారత్‌ వస్తున్న క్లాడ్ మిథోస్! ఎంపిక చేసిన సంస్థలకే శక్తివంతమైన AI మోడల్‌ సేవలు!  

Claude Mythos in India: ఆంత్రోపిక్ AI శక్తివంతమైన మోడల్ అయిన క్లాడ్ మిథోస్ ఇప్పుడు భారత్‌లోకి వస్తోంది. ఎంపిక చేసిన కొన్ని సంస్థలు దీనికి యాక్సెస్ పొందుతాయి. ఈ మోడల్ ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • క్లాడ్ మిథోస్ భారత్‌లోకి ప్రవేశిస్తోంది, ఇది వ్యవస్థలను హ్యాక్ చేయగలదు.
  • మిథోస్ 150 కొత్త సంస్థలు, పలు దేశాలకు అందుబాటులో ఉంది.
  • ఇది కీలక సాఫ్ట్‌వేర్‌లో వేలాది భద్రతా లోపాలు కనుగొంది.
  • దుర్వినియోగం కాని మోడల్ త్వరలో ప్రజలకు విడుదల కావచ్చు.

Claude Mythos in India: టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు మనం చాట్‌జీపీటీ లేదా క్లాడ్ వంటి మోడళ్లను కేవలం సమాచారం కోసం లేదా కంటెంట్ కోసం వాడుతున్నాం. కానీ వీటన్నింటికీ మించిన అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన సామర్థ్యాలు ఉన్న ఒక ఏఐ మోడల్ ఇప్పుడు భారత్‌లోకి అడుగుపెడుతోంది. అదే అమెరికన్ ఏఐ స్టార్టప్‌ ఆంత్రోపిక్‌ అభివద్ధి చేసినక్లాడ్ మిథోస్‌. అసలు ఈ క్లాడ్‌ మిథోస్ ఏంటీ? భారత్‌ ఏయే రంగాలపై ప్రభావం చూపనుంది? దీనిని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. 

సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఆంత్రోపిక్ వారి క్లాడ్ మిథోస్ మోడల్ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కొన్ని భారతీయ సంస్థలు దీనిని పొందేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి, అమెరికన్ కంపెనీ ఆంత్రోపిక్, మరిన్ని సంస్థలు, ప్రభుత్వాలు ,సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఈ మోడల్‌కు యాక్సెస్ అందిస్తామని ఇటీవల ప్రకటించింది. ఈ మోడల్ చాలా శక్తివంతమైనదిగా చెబుతున్నారు. ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ, సాఫ్ట్‌వేర్‌ను అయినా క్షణాల్లో హ్యాక్ చేయగలదు. అందువల్ల, దీనిని ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు.

150 కొత్త సంస్థలు క్లాడ్ మిథోస్‌ను పొందే అవకాశం 

సుమారు 150 కొత్త సంస్థలకు ఈ మోడల్ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆంత్రోపిక్ తెలిపింది. దీంతో మొత్తం సంస్థల సంఖ్య 200కు చేరుతుంది. గతంలో, ఈ సంస్థ యూఎస్,  యూకేలోని కొన్ని కంపెనీలతో ఈ మోడల్‌ పరీక్షిస్తోంది. ఇప్పుడు దీనిని ఆర్థిక సేవలు, సైబర్‌ సెక్యూరిటీ, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, విద్యుత్, నీరు, హార్డ్‌వేర్ రంగాలలోని కంపెనీలతో పరీక్షిస్తున్నారు.

ఇప్పుడు ఈ దేశాలకు ప్రవేశం లభించింది

అమెరికా, యూకేతోపాటు, భారత్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, స్వీడన్, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలలోని సంస్థలకు కూడా ఆంత్రోపిక్ తన మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ దేశాలలో ఏయే సంస్థలు ఇప్పుడు ఈ మోడల్‌ను పొందగలవనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.

కీలకమైన సాఫ్ట్‌వేర్‌లో వేలాది లోపాలు గుర్తించిన మిథోస్ 

ఒకే నెలలో ప్రపంచంలోని అత్యంత కీలకమైన సాఫ్ట్‌వేర్‌లో 10,000కు పైగా సైబర్‌ సెక్యూరిటీ లోపాలను క్లౌడ్ మిథోస్ గుర్తించిందని ఆంత్రోపిక్ ఇటీవల రిపోర్ట్ చేసింది. ఈ మోడల్‌కు యాక్సెస్ ఉన్న అనేక కంపెనీలు, మిథోస్‌ను ఉపయోగించడం ద్వారా లోపాలను గుర్తించే వేగంలో 10 రెట్లు పెరుగుదల నమోదైనట్లు చెప్పింది. గూగుల్,  ఓపెన్‌ఏఐ వంటి కంపెనీలు కూడా ఇప్పుడు ఇలాంటి సైబర్‌ సెక్యూరిటీ మోడళ్లను అమలు చేశాయి .

మిథోస్‌ను పోలిన మోడల్ ప్రజల ముందుకు 

ఇంకా ప్రజల కోసం క్లాడ్ మిథోస్‌ను  విడుదల చేయలేదు. తమతో సహా ఏ కంపెనీ కూడా ఇటువంటి మోడళ్ల తప్పుడు దారిలో వెళ్లకుండా నివారించే మోడల్‌ను అభివృద్ధి చేయలేదని ఆంథ్రోపిక్ పేర్కొంది. అందుకే దుర్వినియోగానికి అవకాశం లేని ఇలాంటి మోడల్‌ను ప్రజలకు విడుదల చేయాలని ఆంథ్రోపిక్‌ భావిస్తోంది. ఇది రాబోయే కొద్ది వారాల్లో విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Frequently Asked Questions

క్లాడ్ మిథోస్ మోడల్ అంటే ఏమిటి?

ఇది ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ AI మోడల్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్‌లు లేదా సాఫ్ట్‌వేర్‌లలోని లోపాలను వేగంగా గుర్తించి, హ్యాక్ చేయగలదు.

క్లాడ్ మిథోస్ భారతదేశంలో అందుబాటులోకి వస్తుందా?

అవును, ఆంత్రోపిక్ వారి క్లాడ్ మిథోస్ మోడల్ భారతదేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కొన్ని భారతీయ సంస్థలు దీనిని పొందేందుకు సిద్ధమవుతున్నాయి.

క్లాడ్ మిథోస్ మోడల్ ఎంత సమర్థవంతమైనది?

ఇది అత్యంత కీలకమైన సాఫ్ట్‌వేర్‌లో ఒకే నెలలో 10,000కు పైగా సైబర్ సెక్యూరిటీ లోపాలను గుర్తించింది. లోపాలను గుర్తించే వేగంలో 10 రెట్లు పెరుగుదల నమోదైంది.

క్లాడ్ మిథోస్ మోడల్ ప్రజలకు అందుబాటులో ఉందా?

లేదు, ఇది ఇంకా ప్రజలకు అందుబాటులో లేదు. దుర్వినియోగానికి అవకాశం లేని మోడల్‌ను రాబోయే కొద్ది వారాల్లో విడుదల చేయాలని ఆంత్రోపిక్ యోచిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget