(Source: Poll of Polls)
Tips to Reduce Electricity Bill: ఈ 8 టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్ తగ్గించేయొచ్చు! మీ డబ్బులు సేఫ్
Power Bill: విద్యుత్ బిల్లు తక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసా? దీని కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వీటిని పాటిస్తే ఎంచక్కా మీ కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది!
How To Reduce Electricity Bill: విద్యుత్ వినియోగదారులకు ఎప్పుడూ అధిక కరెంటు బిల్లు సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఆ భారాన్ని భరించలేక సామాన్యులు ఎప్పుడూ మొర బెట్టుకుంటూనే ఉంటారు. మరి విద్యుత్ బిల్లు తక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసా? దీని కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వీటిని పాటిస్తే ఎంచక్కా మీ కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది!
క్వాలిటీవి కొనుగోలే చేయాలి - ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ వంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కొనేటప్పుడు క్వాలిటీవి చూసి కొనుగోలు చేయాలి. దీని వల్ల కూడా విద్యుత్ తక్కువగా కాలటమే కాకుండా కరెంట్ బిల్ సైతం తక్కువగా వస్తుంది. డబ్బులు సైతం ఆదా అవుతాయి.
ఎల్ఈడీ లైట్ల వినియోగం - సాధారణ బల్బుల వల్ల ఎక్కువ విద్యుత్ కాలుతుంది. అందుకే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే ఎల్ఈడీ లైట్లను వాడటం మంచిది. ఇవి తక్కువ కరెంట్‌ను కాలుస్తాయి. తద్వారా బిల్లు కూడా తక్కువగా వస్తుంది.
ఏసీ నిర్వహణలో మార్పులు - ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారైనా మెకానిక్ ద్వారా సర్వీస్ చేయించాలి. అప్పుడే విద్యుత్ తక్కువగా కాలుతుంది. అలానే ఏసీల మన్నిక కూడా ఎక్కువకాలం ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఏసీని వినియోగించటం కూడా ఎంతో ఉత్తమం అని చెప్పాలి.
పవర్ స్ట్రిప్స్ వాడకం - టీవీ, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను స్టాండ్బైలో ఉంచకూడదు. వినియోగించిన వెంటనే ఆఫ్ చేయాలి. ఎందుకంటే స్టాండ్‌బై మోడ్‌లో ఉంటే కరెంట్ ఎక్కువ కాలుతుంది. తద్వారా కరెంట్ బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది.
అన్‌ప్లగ్ చేయాలి - ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించిన తర్వాత చాలా మంది స్విచ్ ఆఫ్ చేసినా వాటిని అన్‌ప్లగ్ చేయకుండా ఉంచేస్తారు. అలా చేస్తే కరెంట్ కాలుతుంది. కాబట్టి టీవీలు, సెల్‌ఫోన్ ఛార్జర్లు, వైఫై రూటర్లు, కంప్యూటర్లు, వాషింగ్ మెషీన్స్, ఐరన్ బాక్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించిన తర్వాత వెంటనే అన్‌ప్లగ్ చేయాలి.
ఇన్సులేట్ చేయాలి - తలుపులు, కిటికీల్లో ఖాళీలను మూసివేసి, గోడలు, ఇంటి పైకప్పులపై ఇన్సులేషన్‌ను ఇన్స్టాల్ చేస్తే మంచిది. దీంతో హీటింగ్, కూలింగ్ ఖర్చులను తగ్గించుకోవచ్చు.
వాషింగ్ మెషీన్ల వాడకంలో మార్పులు - దుస్తులను ఉతికేందుకు వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించడం తగ్గించడం మంచిది. మరీ బిజీ షెడ్యూల్ ఎక్కువగా ఉంటేనే వీటిని వినియోగించాలి. దీని ద్వారా విద్యుత్ వినియోగాన్ని, నీటిని ఆదా చేయొచ్చు.
క్లాత్స్ ఎయిర్ డ్రై : ఉతికిన దుస్తులను ఆరబెట్టేందుకు క్లాత్స్ ఎయిర్ డ్రైను పక్కనపెట్టి సహజ మార్గాలను ఉపయోగించాలి. దీని ద్వారా కూడా కరెంట్‌ను ఆదా చేయొచ్చు. దుస్తులను గాలి, సూర్యరశ్మిలో ఆరబెట్టాలి.
రెగ్యులర్‌గా ఇలా చేయాలి - అలానే ఉదయం పూట లైట్స్, ఫ్యాన్స్ వినియోగం తగ్గిస్తే కూడా మంచిదే. బయటికి వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా విద్యుత్తును ఆదా చేసుకుని బిల్లును తగ్గించొచ్చు.