By: ABP Desam | Updated at : 02 Mar 2022 09:46 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
బీసీసీఐ లోగో (Image Credit: BCCI)
BCCI Central Contract: 2022 సంవత్సరానికి బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. ఈ కాంట్రాక్టుల్లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాదే (Hardik Pandya) అతి పెద్ద పతనం. తను ఏకంగా గ్రేడ్-ఏ నుంచి గ్రేడ్-సికి పడిపోయాడు. దీంతోపాటు ఎప్పటి నుంచో ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న అజింక్య రహానే (Ajinkya Rahane), చతేశ్వర్ పుజారాలు (Cheteshwar Pujara) కూడా గ్రేడ్-ఏ నుంచి గ్రేడ్-సీకి పడిపోయాడు.
ప్రస్తుతం బీసీసీఐ నాలుగు కేటగిరిల్లో కాంట్రాక్టులను అందిస్తుంది. ఏ+ కేటగిరిలో ఉన్నవారికి సంవత్సరానికి రూ.7 కోట్ల వార్షిక పారితోషికం లభిస్తుంది. గ్రేడ్-ఏలో ఉన్నవారికి రూ.ఐదు కోట్లు, గ్రేడ్-బిలో ఉన్నవారికి రూ.మూడు కోట్ల వార్షిక వేతనం, గ్రేడ్-సిలో ఉన్నవారికి రూ.కోటి వార్షిక వేతనం అందుతుంది.
పుజారా, రహానే ఫాంలో లేకపోవడంతో త్వరలో జరగనున్న శ్రీలంక టెస్టు సిరీస్‌కు కూడా వీరిని జట్టులోకి తీసుకోలేదు. ఇటీవలే బీసీసీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) కాంట్రాక్టులో కూడా వేటు పడింది. తను ఇటీవలే టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. దీంతోపాటు గ్రూప్-బి నుంచి గ్రూప్-సికి డిమోట్ అయ్యాడు.
Veteran wicketkeeper-batter Wriddhiman Saha dropped from Grade B to C in BCCI central contracts after his axing from Test team
— Press Trust of India (@PTI_News) March 2, 2022
Ajinkya Rahane and Cheteshwar Pujara dropped from Grade A to B in latest BCCI central contracts; Hardik Pandya demoted from Grade A to C
— Press Trust of India (@PTI_News) March 2, 2022
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!
Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ ప్రమోషన్! ఐర్లాండ్ టూర్లో టీమ్ఇండియాకు కెప్టెన్సీ!!
Rajat Patidar: 'అన్‌సోల్డ్'గా మిగిలి 'అన్‌టోల్డ్ స్టోరీ'గా మారిన రజత్ పాటిదార్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?