ROHIT SHARMA: నా పని అయిపోయిందనున్నారా? - టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
టీ20 కెరీర్‌ను వదిలే ఆలోచన లేదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
Rohit Sharma On T20: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన టీ20 అంతర్జాతీయ కెరీర్ గురించి పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. టీ20 టీమ్‌లో తాను భాగమవుతానా లేదా అని చెప్పాడు. జనవరి 10వ తేదీ నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అంతకుముందు ఆడిన టీ20 సిరీస్‌లో రోహిత్ జట్టులో లేకపోవడంతో అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. అప్పటి నుంచి రోహిత్ శర్మ టీ20 జట్టులోకి తిరిగి రాలేడనే వార్తలు జోరందుకున్నాయి. ఇప్పుడు దానికి ఆయనే స్వయంగా సమాధానం చెప్పారు.
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ తన టీ20 అంతర్జాతీయ కెరీర్ గురించి సమాధానమిస్తూ, "నేను ఇంకా T20 ఫార్మాట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకోలేదు" అని చెప్పాడు. ఇప్పుడే టీ20 నుంచి దూరం కానని, రాబోయే టీ20 సిరీస్‌లో భారత జట్టులో కనిపిస్తానని తెలిపాడు. తన టీ20 కెరీర్‌తో పాటు అనేక ఇతర ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చాడు.
విలేకరుల సమావేశంలో కొన్ని ముఖ్య విషయాలు
• జస్‌ప్రీత్ బుమ్రా గురించి అప్‌డేట్ ఇస్తూ, రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు తను కొంచెం ఇబ్బంది పడ్డాడని చెప్పాడు.
• రోహిత్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్ గురించి ఇలా చెప్పాడు, ‘నేను ఇంకా T20 క్రికెట్‌ను విడిచిపెట్టలేదు. దానికి ఇంకా సమయం ఉంది.’
• దురదృష్టవశాత్తు ఇషాన్ కిషన్‌కు తుదిజట్టులో చోటు ఇవ్వలేమని భారత జట్టు ఓపెనింగ్ గురించి చెప్పాడు. ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు ఈ అవకాశం లభించింది.
ఈ ప్రశ్నలన్నింటి తర్వాత కూడా, శ్రీలంకతో మొదటి వన్డేకు సంబంధించి అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఓపెనింగ్‌లో రోహిత్‌తో పాటు శుభమాన్ గిల్ లేదా కేఎల్ రాహుల్ కనిపించనున్నారు. ఇది కాకుండా మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలపలేదు. వన్డేల్లో గత కొద్ది సంవత్సరాలుగా శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నాడు.
View this post on Instagram