అన్వేషించండి

ROC, Tokyo Olympic 2020: టోక్యో ఒలింపిక్స్‌లో రష్యా ఏ పేరుతో పాల్గొందో తెలుసా? ఇంతకీ పేరు ఎందుకు మార్చుకుంది?

రష్యా ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో ఆ దేశం పేరుతో పాల్గొనలేదు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో ఆడకుండా రష్యాపై నిషేధముంది.

ఏ క్రీడా పోటీల్లోనైనా రష్యా వాళ్లు ఉంటే మిగతా దేశాల క్రీడాకారులకి కాస్త ఆందోళన. ప్రత్యర్థులపై ఆధిపత్యంతో పతకాలు ఎగరేసుకుపోతుంటారు రష్యన్స్. అలాగే ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడల్లో అయితే పతకాల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. అలాంటి రష్యా ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో ఆ దేశం పేరుతో పాల్గొనలేదు. 

ఎందుకంటే ఒలింపిక్స్‌లో ఆడకుండా రష్యాపై నిషేధముంది. అయితే మాత్రం ఒలింపిక్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే రష్యా ఈ పోటీల్లో పాల్గొనకుండా ఊంటుందా? మరో మార్గంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ‘ఆర్‌వోసీ’ పేరుతో ఆ దేశ‌ క్రీడాకారులు విశ్వక్రీడల్లో పాల్గొనేలా చేసింది.

ఇంతకీ నిషేధం ఎందుకు?

అథ్లెట్లకు నిర్వహించే డోపింగ్‌ పరీక్షలకు సంబంధించి రష్యా అవకతవకలకు పాల్పడిందని 2014 నుంచి ఆరోపణలు వస్తున్నాయి. విచారణ జరిపిన వరల్డ్‌ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ(వాడా).. 2015లో రష్యాలో యాంటీ డోపింగ్‌ ల్యాప్‌ను మూసివేసింది. వంద మంది క్రీడాకారుల్ని క్రీడల్లో పాల్గొనకుండా డిబార్‌ చేసింది. డోపింగ్‌ పరీక్షలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిందన్న కారణంగా 2019 డిసెంబర్‌లో రష్యాపై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్లు వాడా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒలింపిక్స్‌, ఫిఫా వరల్డ్‌ కప్‌-2022, సహా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి రష్యాకు వీలు లేకుండా పోయింది. దీంతో ఒలింపిక్స్‌లో పాల్గొనడం కోసం కఠోర శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆందోళనకు గురయ్యారు. అయితే, వాడా నిర్ణయంపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని రష్యా ఉపయోగించుకుంది. 

నిషేధం రెండేళ్లకు కుదింపు...కానీ

ఈ విషయంపై కోర్ట్‌ ఆఫ్‌ అర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్‌) విచారణ చేపట్టి.. వాడా విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది. అంటే రష్యాపై నిషేధం 2022 డిసెంబర్‌ వరకే ఉంటుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌ 2020లో పాల్గొనే అవకాశం లేక అథ్లెట్లు నష్టపోతారు. అందుకోసం తెలివిగా రష్యా ఏం చేసిందో తెలుసా? డోపింగ్‌ కుంభకోణంతో సంబంధంలేని క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో కొన్ని షరతులతో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి కాస్‌ వెసులుబాటు ఇచ్చింది. రష్యా నుంచి ఒలింపిక్స్‌కు అర్హత పొందే క్రీడాకారులు అక్కడ రష్యా దేశం పేరు, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని వాడకూడదని కాస్ స్పష్టం చేసింది. 

రష్యా కాస్త రష్యన్‌ ఒలింపిక్స్‌ కమిటీ


కాస్‌ తీర్పుపై వాడా అసంతృప్తి వ్యక్తం చేయగా.. రష్యా స్వాగతించింది. దీంతో ఒలింపిక్స్‌లో ఆడే అథ్లెట్లు రష్యాకి కాకుండా రష్యన్‌ ఒలింపిక్స్‌ కమిటీ(ఆర్‌వోసీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందుకే, విశ్వక్రీడల్లో రష్యా పేరు ఉండాల్సిన చోట ఆర్‌వోసీ దర్శనిమిస్తోంది. ప్రారంభోత్సవ సమయంలోనూ రష్యన్‌ అథ్లెట్లు ఆర్‌వోసీ పేరుతో పాల్గొన్నారు.

రష్యాకు కొత్తేం కాదు

రష్యాకు ఇలా పేరు మార్చుకోవడం కొత్తేం కాదు. గతంలోనూ చాలా సార్లు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించే అథ్లెట్ల శిబిరం పేరు కూడా మారేది. 1900 నుంచి 1912 వరకు రష్యన్‌ ఎంపైర్‌ పేరుతో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రష్యా.. 1952-88 మధ్య సోవియట్‌ యూనియన్‌గా.. 1992లో యూనిఫైడ్‌ టీమ్‌గా, 1996 నుంచి రష్యా పేరుతో ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. నిషేధం నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌-2020లో ఆర్‌వోసీగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget