By: ABP Desam | Updated at : 30 Jul 2021 05:03 AM (IST)
ఒలింపిక్స్ ఆటగాళ్లకు ఐనాక్స్ బంపర్ ఆఫర్
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు, పతకాలు తెచ్చే క్రీడాకారులకు దేశంలోని పలు రాష్ట్రాలు నజరానాల మీద నజరానాలు ప్రకటించారు. లక్షల నుంచి కోట్ల రూపాయలతో పాటు ప్రత్యేక హోదాలు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు.
కాగా, తాజాగా ప్రముఖ మల్టీప్లెక్స్ ‘ఐనాక్స్’ కూడా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు లైఫ్ లాంగ్ మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ అందరికీ ఒక ఏడాది పాటు ఈ ఆఫర్ వర్తింపజేస్తామని ట్విటర్ పేజీ ద్వారా ఐనాక్స్ వెల్లడించింది.
INOX takes immense pride in all the endeavors of #TeamIndia at #Tokyo2020 🌟✨
We are happy to announce free movie tickets for lifetime for all the medal winners🏅& for one year for all the other athletes🎟️🎟️#AayegaIndia #INOXForTeamIndia #EkIndiaTeamIndia #Respect #JaiHind 🇮🇳 pic.twitter.com/evaAAJbgKx— INOX Leisure Ltd. (@INOXMovies) July 27, 2021
ఇదిలా ఉండగా...టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన మీరాబాయి చానుకు ఇప్పటికే డొమినోస్ పిజ్జా లైఫ్ టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మీరాబాయికి లైఫ్ టైం ఫ్రీగా పిజ్జాలు ఇస్తామని తెలిపింది. పతకం గెలిచిన తర్వాత చాను మాట్లాడుతూ... తనకు పిజ్జా తినాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో డోమినోస్ పిజ్జా చానుకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఇక ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన మీరాబాయిపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ.2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించగా, మణిపూర్ సర్కార్ కూడా కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది.
క్లాస్ -1 ప్రభుత్వ ఉద్యోగం
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోం సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడకారులకు అసోంలో క్లాస్ -1 ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. కామన్ వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్‌లలోనూ పతకాలు గెలిచిన క్రీడాకారులకు క్లాస్ -2, క్లాస్ -3 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని సీఎం శర్మ చెప్పారు. అసోం పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకువస్తామని, దీనిపై నివేదిక సమర్పించేందుకు రిటైర్డు ఐఎఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ నేతృత్వంలో పోలీసు కమిషన్‌ను నియమించామని సీఎం చెప్పారు.
Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ పొడిగింపు
Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్ గన్
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
/body>