తలపడుతున్న ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్‌సన్ (Photo: International Chess Federation Twitter)
ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్ గేమ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. టైటిల్ కోసం దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో భారత చెస్ సంచలనం ప్రజ్ఞానంద పోటీ పడుతున్నాడు. వరుసగా రెండో గేమ్‌నూ డ్రాగా ముగించాడు. మంగళవారం జరిగిన తొలి గేమ్ కూడా ఫలితం తేలకుండా ముగిసింది. బుధవారం రెండో గేమ్ కూడా డ్రా అయింది. తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్ మొదటి నుంచి డ్రా దృష్టిలో పెట్టుకునే ఎత్తులు వేశాడు. మరోవైపు నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కూడా సైతం పావులు కదిపాడు.
మొదటి నుంచి కార్ల్‌సన్ పోరును టైబ్రేక్‌కు మళ్లించేందుకే ప్రయత్నించాడు. సెమీస్ తర్వాత కలుషిత ఆహారం తిని అనారోగ్యం బారిన పడ్డానని చెబుతూ కార్ల్‌సన్ గేమ్‌ను టై బ్రేక్ వైపు తిప్పేందుకు యత్నించాడు. ఒక రోజు ఆగితే మరింత శక్తి వస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో తలపడొచ్చని భావించాడు. అయితే ప్రజ్ఞానంద అంతే రక్షణాత్మకంగానే వ్యవహరించాడు.
దీంతో 30 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు అంగీకరించారు. రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్‌సన్ 1-1తో సమానంగా ఉన్నారు. గురువారం విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ గేమ్ జరుగనుంది. దీనిపైనే అందరి దృష్టి నెలకొంది. మరోవైపు మూడో స్థానం కోసం జరుగుతున్న పోరులో తొలి గేమ్‌లో కరువానా (అమెరికా)పై అబసోవ్ (అజర్‌బైజాన్) గెలిచాడు.
కార్ల్‌సన్ ఆటతీరుపై ప్రజ్ఞానంద స్పందించాడు. కార్ల్‌సన్ వేగంగా డ్రా చేస్తాడని అనుకోలేదని చెప్పారు. టైబ్రేక్ కోసమే అతను అలా ఆడాడని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ టోర్నీలో చాలా టైబ్రేక్‌లు ఆడానని, తాను కూడా కాస్త అలసిపోయానని అన్నారు. గురువారం పోరులో పూర్తి స్థాయిలో పోరాడేందుకు మెదడును తాజాగా ఉంచుకుంటానన్నారు. ఎక్కువ గేమ్‌లు ఆడడంతో పాటు తక్కువ సమయంలో స్పందించాల్సి ఉంటుందన్నారు. కార్ల్‌సన్ పూర్తి శక్తితో ఉన్నాడనిపించలేదని, అతను కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. తన తల్లి అమ్మ తనతో పాటు సోదరికి ఎప్పుడూ కొండంత అండగా ఉంటోందన్నారు.
తనకు వైద్యం అందించిన టోర్నీ నిర్వాహకులు, వైద్యులు, నర్సులకు కార్ల్‌సన్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని, కానీ పోరాడేందుకు పూర్తి శక్తి లేదనిపించిందన్నారు. అందుకే మరో రోజు విశ్రాంతి కావాలనుకున్నానని, గురువారం పూర్తి శక్తి సాధిస్తానని నమ్మకం వ్యక్తం చేశాడు. ప్రజ్ఞానంద ఇప్పటికే బలమైన ఆటగాళ్లతో చాలా టైబ్రేక్‌లు ఆడాడని, అతను బలమైన ఆటగాడని తెలుసన్నారు. తనకు మంచి రోజు కలిసొస్తే కచ్చితంగా గెలిచే అవకాశాలుంటాయన్నారు.
టై బ్రేక్ అంటే ఏంటి?
ఈ ప్రపంచకప్‌లో అంతా నాకౌట్ ఫార్మాట్లో జరుగుతుంది. ఇందులో ప్రతి రౌండ్లోనూ మొదట రెండు క్లాసికల్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఇందులో విజేత ఎవరో తేలకపోతే అప్పుడు టైబ్రేక్ నిర్వహిస్తారు. ఈ విధానంలో మొదట ర్యాపిడ్‌లో పోటీ నిర్వహిస్తారు. రౌండ్‌కు రెండు గేమ్‌లు చొప్పున రెండు రౌండ్లు పోటీ ఉంటుంది. తొలి రౌండ్లో ఫలితం వస్తే పోటీ ఆపేసి విజేతను ప్రకటిస్తారు.
అయితే ర్యాపిడ్ రౌండ్లు ముగిసినా ఆటగాళ్ల పాయింట్లు సమానంగా ఉంటే బ్లిట్జ్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో రౌండ్‌కు రెండు గేముల చొప్పున ఈ పోటీలు జరుగుతాయి. రెండు రౌండ్లలో ఫలితం తేలకపోతే ఎవరో ఒకరు విజేతగా నిలిచేంతవరకూ బ్లిట్జ్ గేమ్‌లు కొనసాగిస్తూనే ఉంటారు.
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
Asian Games 2023: చైనా పర్యటన రద్దు చేసుకున్న కేంద్రమంత్రి, అరుణాచల్ ఆటగాళ్లకు వీసా ఇవ్వకపోవడంతో నిర్ణయం
IND vs AUS 1st ODI: డేవిడ్ భాయ్ హాఫ్ సెంచరీ - చుక్కలు చూపిస్తున్న షమి
IND vs AUS 1st ODI: తొలి వన్డే టాస్ మనదే! రాహుల్ ఏం ఎంచుకున్నాడంటే!
Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన
/body>