Thailand Open: ప్చ్.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!
Thailand Open: థాయ్‌ల్యాండ్ ఓపెన్లో తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది! టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్‌యూఫీ చేతిలో ఓటమి పాలైంది.
Thailand Open PV Sindhu Bows Out After Losing In Semifinals To Chen Yu Fei : థాయ్‌ల్యాండ్ ఓపెన్లో తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది! టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్‌యూఫీ చేతిలో ఓటమి పాలైంది. మహిళల సెమీస్‌లో 17-21, 16-21 తేడాతో వరుస గేముల్లో ఓటమి చవిచూసింది. ఫైనల్‌కు చేరుకోకుండానే వెనక్కి మళ్లింది.
ఈ టోర్నీలో పీవీ సింధు ఆరో సీడ్‌గా బరిలోకి దిగింది. ఈ మ్యాచుకు ముందు ప్రత్యర్థి చెన్ యూఫీపై 6-4 తేడాతో ఆమెదే పైచేయి. చివరిసారిగా వీరిద్దరూ 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తలపడ్డారు. అప్పుడు చెన్‌దే విజయం. అదే జోరును ఆమె ఇప్పుడూ కొనసాగించింది.
సెమీస్ మొదటి గేమ్‌లో మొదట సింధు, చెన్ 3-3తో సమంగా ఉన్నారు. అదే సమయంలో చెన్ విజృంభించి 11-7తో సింధును వెనక్కి నెట్టింది. ఆ తర్వాత వరుసగా ర్యాలీలు ఆడుతూ ఆధిపత్యం చెలాయించింది. చివరి ఐదు గేమ్ పాయింట్లు అందుకొని విజయం సాధించింది.
💔
— BAI Media (@BAI_Media) May 21, 2022
Despite a good fight @Pvsindhu1 goes down against Tokyo Olympic Champion 🇨🇳's Chen Yu Fei 17-21, 16-21 in the semifinals of #ThailandOpen2022.#BWFWorldTour#Badminton pic.twitter.com/7EjhTNKyrJ
రెండో గేమ్‌లో సింధు కాస్త దూకుడుగానే ఆడింది. 6-3తో పైచేయి సాధించింది. రెండు పాయింట్ల కుషన్‌తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత చెన్ చెలరేగింది. 15-12తో ముందుకెళ్లింది. ఆమె జోరును సింధు అడ్డుకోకపోవడంతో నాలుగు మ్యాచ్ పాయింట్లు సాధించిన చెన్ సునాయాసంగా గెలుపు తలుపు తట్టింది.
ఈ సీజన్లో సింధు ప్రదర్శన ఫర్వాలేదు. రెండు సూపర్ 300 టైటిళ్లు గెలిచింది. సయ్యద్ మోదీ, స్విప్ ఓపెన్ విజేతగా నిలిచింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్న ఈ తెలుగు తేజం జూన్ 7 నుంచి 12 వరకు జకార్తాలో జరిగే ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో పాల్గొంటుంది.
𝗦𝗘𝗠𝗜𝗙𝗜𝗡𝗔𝗟𝗦 💥
— BAI Media (@BAI_Media) May 21, 2022
🇮🇳 @Pvsindhu1 🆚 Chen Yu Fei 🇨🇳
⏰: 11:30 am IST (Tentative)
📺: @VootSelect & @Sports18#ThailandOpen2022#BWFWorldTour#IndiaontheRise#Badminton pic.twitter.com/SxyfdO73iL