India coach: టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్! న్యూజిలాండ్ సిరీస్ తర్వాత అధికారికంగా ఎంపిక?
కోచ్‌గా ఉండేందుకు దాదాపుగా ద్రవిడ్ అంగీకరించాని వార్తలు వస్తున్నాయి. బౌలింగ్ కోచ్‌గా అతడి సహచరుడు పరాస్ మహంబ్రేను తీసుకోనున్నారని తెలిసింది. కివీస్ సిరీస్ తర్వాత అధికారిక ప్రక్రియ ఆరంభం కానుంది.
టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికవ్వడం లాంఛనమే అనిపిస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి నుంచి అతడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడని సమాచారం. కోచ్‌గా ఉండేందుకు దాదాపుగా ద్రవిడ్ అంగీకరించాని వార్తలు వస్తున్నాయి. బౌలింగ్ కోచ్‌గా అతడి సహచరుడు పరాస్ మహంబ్రేను తీసుకోనున్నారని తెలిసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుంది. అతడు మరోసారి ఆ పదవినీ చేపట్టేందుకు సుముఖంగా లేడని తెలిసింది. పైగా 60 ఏళ్లకు చేరుకోవడంతో అర్హుడు కాడు. దాంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వెతుకులాట మొదలైంది. బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు గంగూలీ, జే షాకు ద్రవిడ్‌పైనే ఇష్టం ఉంది. కానీ ఆ పదవిని చేపట్టేందుకు ద్రవిడ్ పూర్తి ఇష్టం ప్రదర్శించడం లేదు.
ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమ్‌ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. దానికి మాత్రం ద్రవిడే కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. సుముఖంగా లేనప్పటికీ కివీస్ వెళ్లాల్సిందేనని అతడిపై బీసీసీఐ ఒత్తిడి తెస్తోంది. అంతేకాకుండా పూర్తికాలపు కోచ్‌గా ఉండాలని కోరుకుంటుంది. ద్రవిడ్ ఏ విషయం బయటకు చెప్పనప్పటికీ త్వరలోనే అధికారిక ప్రక్రియ మొదలవ్వనుందని తెలిసింది.
Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా
రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ పదవీ కాలమూ ముగుస్తోంది. బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంది. ఒకవేళ ద్రవిడ్ కోచ్ అయితే మాత్రం బౌలింగ్ కోచ్‌గా పరాస్ మహంబ్రే ఎంపిక అవుతాడని తెలుస్తోంది. 'మిస్టర్ డిపెండబుల్' అండర్ 19, భారత్-ఏ కోచ్‌గా ఉన్నప్పుడు అతడే బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇప్పుడు బెంగళూరు ఎన్‌సీయేలోనూ అతడే బౌలింగ్ కోచ్. కాబట్టి అతడి ఎంపిక లాంఛనమే అంటున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తి సమాచారం తెలియనుంది.
Also Read: ఎందుకు 'డాడీస్ ఆర్మీ'నే గెలుస్తుంది? ఏంటీ వీళ్ల గొప్ప? ధోనీ ఒక్కడుంటే చాలా?