T20 World Cup 2021: నేడే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభం.. మొదటి రోజే రెండు మ్యాచులు.. వివరాలు ఇవే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సంరంభం మొదలైంది. ఆదివారం టీ20 ప్రపంచకప్ రౌండ్ వన్ మొదలవుతోంది. తొలి మ్యాచులో ఒమన్, పపువా న్యూగినీ తలపడుతున్నాయి. రెండో మ్యాచులో బంగ్లాదేశ్, స్కాట్లండ్ ఆడుతున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సంరంభం మొదలైంది. ఆదివారం టీ20 ప్రపంచకప్ రౌండ్ వన్ పోటీలు మొదలవుతున్నాయి. ఈ దశలో అర్హత సాధించిన నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. యూఏఈ, ఒమన్ వేదికగా మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో ఒమన్, పపువా న్యూగినీ తలపడుతున్నాయి. మధ్యాహ్నం 3:30కు మ్యాచ్ మొదలవుతుంది. రాత్రి 7:30 గంటలకు బంగ్లాదేశ్, స్కాట్లండ్ తలపడుతున్నాయి.
ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం టీమ్‌ఇండియా సహా ఎనిమిది జట్లు సూపర్-12 దశకు నేరుగా అర్హత సాధించాయి. మరో నాలుగు జట్ల కోసం ఇప్పుడు మొదటి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. వాటిని గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. గ్రూప్-ఏలో రెండు మ్యాచులు ఆదివారం జరుగుతున్నాయి. -గ్రూప్-బిలో నెదర్లాండ్స్- ఐర్లాండ్, నమీబియా-శ్రీలంక సోమవారం మ్యాచులు ఆడతాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తలో రెండు జట్లు సూపర్-12కు అర్హత పొందుతాయి.
Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?
టీ20 ప్రపంచకప్‌నకు ఒమన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్‌లో పాల్గొనడం ఒమన్‌కు ఇది రెండోసారి. మొదటి సారి 2016 ప్రపంచకప్‌లో ఒమన్ ఆడింది. జీషన్ మక్సూద్ జట్టుకు సారథ్యం వహించాడు. మరో కీలక విషయం ఏంటంటే ఒమన్ ఆటగాళ్లు ఒకవైపు పని చేసుకుంటూనే క్రికెట్ ఆడుతున్నారు. పవువా న్యూగినీ తొలిసారి ప్రపంచకప్ ఆడుతోంది. ఇందుకు ఆ జట్టు ఎంతగానో గర్విస్తోంది.
Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్ గంభీర్
ఇప్పటి వరకు బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శనైతే చేయలేదు. కేవలం ఒక మ్యాచులో గెలిచింది. ఇప్పుడు మాత్రం మంచి ఫామ్‌లో ఉంది. సూపర్-12కు కచ్చితంగా అర్హత సాధిస్తుంది. సొంతగడ్డపై ఆ జట్టు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించింది. స్కాట్లాండ్ 2007, 2009, 2016 ప్రపంచకప్పుల్లో ఆడిన తొలి రౌండ్లోనే వెనుదిరిగింది.
Also Read: ఐపీఎల్ ఫైనల్ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
ప్రపంచకప్‌లో కీలకమైన సూపర్-12 రౌండ్ అక్టోబర్ 23న మొదలవుతోంది. తొలి మ్యాచులో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ తలపడనుంది. ఆ మరుసటి రోజే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన భారత్, పాక్ పోరు జరుగుతుంది. సూపర్-12 గ్రూప్ వన్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. మిగతా జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో నవంబర్ 14న జరగనుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
𝕄𝕒𝕥𝕔𝕙 𝔻𝕒𝕪 🥳
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
What are your predictions?#T20WorldCup pic.twitter.com/xe2Y9AoP08
LOADING...
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
██████████████]99%#T20WorldCup pic.twitter.com/KuYbl2O82m
From popular landmarks to famous cricket grounds to backyards 🗺️
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
Take a look back at a hugely successful ICC Men’s #T20WorldCup 2021 #TrophyTour driven by @Nissan.