By: ABP Desam | Published : 06 Nov 2021 10:45 AM (IST)|Updated : 06 Nov 2021 10:45 AM (IST)
Edited By: Ramakrishna Paladi
విరాట్ కోహ్లీ
స్కాట్లాండ్‌పై భారీ విజయం తర్వాత టీమ్‌ఇండియా సంబరాలు చేసుకుంది. విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంది. దాంతో డ్రస్సింగ్ రూమ్‌లో సందడి వాతావరణం నెలకొంది.
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ శుక్రవారం 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ సారథిగా అతడు బర్త్‌డే రోజు మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. పైగా టాస్ గెలిచాడు. టీమ్‌ఇండియా సైతం అనుకున్నట్టుగానే విజయం అందుకుంది.
Cake, laughs and a win! 🎂 😂 👏#TeamIndia bring in captain @imVkohli's birthday after their superb victory in Dubai. 👍 👍 #T20WorldCup #INDvSCO pic.twitter.com/6ILrxbzPQP
— BCCI (@BCCI) November 5, 2021
మొదట టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కేవలం 17.4 ఓవర్లలో 85కే ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కేవలం 15 పరుగులు ఇచ్చి చెరో 3 వికెట్లు తీశారు. బుమ్రా ఒక వికెట్ అందించాడు. అఫ్గాన్ రన్‌రేట్‌ను మించాలంటే ఆ స్కోరును 7.1 ఓవర్లలోనే ఛేదించాలి. కానీ టీమ్‌ఇండియా కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లో 6 బౌండరీలు, 3 సిక్సర్లతో అర్ధశతకం బాదేశాడు. రోహిత్ సైతం 16 బంతుల్లోనే 5 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు సాధించాడు.
జట్టు విజయం అందుకోగానే టీమ్‌ఇండియా డ్రస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నాడు. ఎంఎస్ ధోనీ అందరితోనూ కలిసిపోయి సరదాగా గడిపాడు. కేక్ కోసి కోహ్లీ దానిని అందరికీ తినిపించాడు. రిషభ్ పంత్, సూర్యకుమార్, జడ్డూ, ఇషాన్ కిషన్ ఉత్సాహంగా కనిపించారు. ఈ వేడుకల వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. కాగా మ్యాచ్ ముగిశాక టీమ్‌ఇండియా ఆటగాళ్లు స్కాట్లాండ్ డ్రస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. వారితో కలిసి మాట్లాడారు.
MUST WATCH: #SpiritOfCricket was at its best as Scotland expressed their wish to visit the #TeamIndia dressing room & our boys made them feel at home🤝👌👌 - By @Moulinparikh
— BCCI (@BCCI) November 6, 2021
Special feature 🎥 🔽 #T20WorldCup #INDvSCO https://t.co/pfY3r9evwH pic.twitter.com/g6g6A86zve
Also Read: T20 WC Standings: ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!
Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!
Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం
PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!
PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
CSK Worst Record: ఐపీఎల్లో చెన్నై చెత్త రికార్డు - 15 సీజన్లలో ఏ జట్టూ చేయని ఘోరమైన ప్రదర్శన!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !