T20 WC 2021: టీమ్‌ఇండియాకు మస్తు మంది కీపర్లు ఉన్నారు! పంత్‌ను కవ్వించిన కోహ్లీ
విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ పంచ్‌లు విసురుకున్నారు. భారత్కు మరెందరో వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారని కోహ్లీ కవ్విస్తే సిక్సర్ కొట్టి ప్రపంచకప్ అందించిందే వికెట్ కీపరని పంత్ అన్నాడు
టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సరదా సంభాషణకు దిగారు! ఒకరిపై మరొకరు పంచ్‌లు విసురుకున్నారు. భారత జట్టుకు మరెందో వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారని కోహ్లీ కవ్విస్తే.. భారత్‌కు సిక్సర్ కొట్టి ప్రపంచకప్ అందించిందే వికెట్ కీపరని పంత్ దీటుగా బదులిచ్చాడు. ఇంతకీ వీరెందుకు ఇలా కవ్వించుకుంటున్నారో తెలుసా?
Also Read: తుది సంగ్రామం నేడే.. కప్పు కోల్‌కతా కొడుతుందా.. చెన్నై చేతికొస్తుందా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ మరి కొన్ని రోజుల్లో ఆరంభమవుతోంది. మెగా టోర్నీ బజ్ పెంచేందుకు ప్రసారదారు స్టార్ ఇండియా ప్రత్యేకంగా వీడియోలు రూపొందిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన 'మోకా.. మోకా' వీడియోకు విపరీతంగా క్రేజ్ లభించింది. ఇండియన్ ప్రీమియర్ లీగులో రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ ప్రదర్శనను ప్రతిబింబిస్తూ మరో టీవీసీని రూపొందించింది. అందులోనే సంభాషణే ఇది..!
Also Read: నేనైతే అశ్విన్‌కు చోటివ్వను..! కేవలం పరుగుల్ని నియంత్రిస్తే సరిపోదన్న మంజ్రేకర్
పంత్ తన బ్యాటింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుతుండగా భారత జట్టుకు చాలామంది వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారని కోహ్లీ బదులిచ్చాడు. 'రిషభ్.. టీ20 క్రికెట్లో మ్యాచులను సిక్సర్లే గెలిపిస్తాయి' అని కోహ్లీ అంటే.. 'ఆందోళనకు చెందకు భయ్యా. నేను ప్రతిరోజూ సాధన చేస్తున్నాను. సిక్సర్ కొట్టి భారత్‌కు ప్రపంచకప్ అందించింది వికెట్ కీపరే' అని బదులిచ్చాడు.
.@imVkohli remembers @msdhoni while calling @RishabhPant17 🤔
— Star Sports (@StarSportsIndia) October 14, 2021
Learn why in Part 1 of #SkipperCallingKeeper & stay tuned for Part 2!#LiveTheGame, ICC Men's #T20WorldCup 2021:#INDvENG | Oct 18, Broadcast: 7 PM, Match: 7.30 PM#INDvAUS | Oct 20, Broadcast: 3 PM, Match: 3.30 PM pic.twitter.com/SLYXUQj75g
Also Read: రోహిత్‌శర్మకు ఇష్టమైన సినిమా, మైదానం, వంటకం ఏంటో తెలుసా?
టీమ్‌ఇండియాకు ఇప్పుడు వికెట్ కీపర్ తానే అని పంత్ చెప్పగా 'నిజమే, కానీ మహీ భాయ్ తర్వాత అంతటి వికెట్ కీపర్ దొరకలేదు' అని కోహ్లీ అన్నాడు. 'చూడు, ఇప్పుడు చాలామంది వికెట్ కీపర్లు ఉన్నారు. వార్మప్ మ్యాచుల్లో ఎవరు బాగా ఆడతారో చూద్దాం' అని విరాట్ ముగించాడు.
Skipper 🤙 'keeper - What's brewing between @imVkohli & @RishabhPant17 ahead of the ICC #T20WorldCup 2021? 🤨
— Star Sports (@StarSportsIndia) October 14, 2021
Guess 👇 & stay tuned for more interesting chats when it’s time for #SkipperCallingKeeper!#LiveTheGame #TeamIndia #ViratKohli #RishabhPant pic.twitter.com/1DiUkUfo5E
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Skipper @imVkohli & Keeper @RishabhPant17
— StarSportsTelugu (@StarSportsTel) October 15, 2021
వీళ్ళ మధ్య ఏం సంభాషణ జరుగుతుంది 😎
అసలు దేనిగురించి మాట్లాడుకుంటున్నారు 🤔
తెలుసుకోవడానికి వెయిట్ చేయండి#SkipperCallingKeeper!#LiveTheGame #ViratKohli #RishabhPant ICC #T20WorldCup pic.twitter.com/NHNtsdZptt