Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. ఎన్నికల ప్రక్రియను హైకోర్టు ఎలా నిలిపివేసిందో అర్థం చేసుకోలేకపోయామని జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూనే రిట్ పిటిషన్ ఫలితానికి లోబడి ప్రక్రియ ఉండాలనడం సరైన పద్ధతి అని అందుకు అనుగుణంగానే ఎన్నికల నిలుపుదల ఉత్తర్వులను పక్కన పెడుతున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల ఫలితం రిట్ పిటిషన్ ఆదేశాలకు లోబడి ఉంటుందని స్పష్టంచేసింది. హైకోర్టు స్టే రద్దవడంతో డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల కొత్త తేదీలను బుధవారం ప్రకటించే అవకాశముంది.
తొలుత జులై 11, తర్వాత ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా కొన్ని కారణాలతో వాయిదా పడ్డాయి. చివరిసారిగా ఆగస్టు 12న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఒక్క రోజు ముందు పంజాబ్ అండ్ హర్యానా కోర్టు ఎన్నికలపై స్టే విధించింది. హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్‌కు ఓటు హక్కు కల్పించడంపై హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ సవాలు చేయడంతో మరోసారి ఎన్నికలు నిలిచిపోయాయి. సమయంలోగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్‌ఐని సస్పెండ్ చేసింది. ‘భారత ఒలింపిక్ సంఘం నియమించిన రిటర్నింగ్ అధికారితో మాట్లాడామని. బుధవారంలోపు ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని WFI అడ్‌హక్ కమిటీ సభ్యుడు భూపేందర్‌సింగ్ బజ్వా తెలిపారు.
కొన్ని నెలలుగా భారత రెజ్లింగ్ సమాఖ్యను వివాదాలు వెంటాడుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. వాస్తవంగా 2023 జూన్‌లోనే ఎన్నికలు జరగాల్సింది. కొందరు రెజ్లర్లు ఆందోళనకు దిగడం, రాష్ట్ర సంఘాలు లీగలు పిటిషన్లు దాఖలు చేయడంతో వాయిదా పడ్డాయి. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య భారత్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం వల్ల రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెజ్లర్లు జాతీయ పతాకం కింద ఆడలేరు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఒలింపిక్ అర్హతకు ఎంతో కీలకం. ఇలాంటి కీలక టోర్నీలో రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సి వస్తుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా రెజ్లర్లు ఆందోళన బాట పట్టగా.. అది చినికి చినికి గాలి వానలా మారింది. వారికి పురుష రెజ్లర్లు కూడా మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని పెంచిన సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్, బజరంగ్ పునియా వంటి వాళ్లు తమకు న్యాయం చేయాలని మొత్తుకున్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అతడిపై విచారణ చేపట్టాలనే డిమాండ్‌తో ధర్నాకు దిగిన రెజ్లర్లు.. శాంతియుత మార్గంలో నిరసన తెలిపారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సమయంలో అక్కడికి చేరి ఆందోళన చేయగా వారిని అరెస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply