Sreesanth Retirement: క్రికెట్‌కు గుడ్‌పై చెప్పేసిన శ్రీశాంత్‌ - ఆకాశానికి ఎగిసి నేలపై పడ్డ స్టార్‌!

Sreesanth Retirement: క్రికెటర్ శ్రీశాంత్ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు! కేరళ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న అతడు హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాడు.

FOLLOW US: 

Sreesanth Retirement:  టీమ్‌ఇండియా స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు! తర్వాతి తరాలకు అవకాశాలు దొరికేందుకే తాను ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. కేరళ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న శ్రీశాంత్‌ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. గాయాల పాలైన అతడు ఈ మధ్యే ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

'తర్వాతి తరం క్రికెటర్ల కోసం నా ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా. నాకు సంతోషకరం కానప్పటికీ ఈ నిర్ణయం నేనే తీసుకున్నా. నా జీవితంలో ఈ దశలో నేను గౌరవప్రదంగా వేస్తున్న సరైన అడుగు ఇది. కెరీర్‌లో ప్రతి సందర్భాన్నీ నేను ఆస్వాదించాను. నా కుటుంబం, నా జట్టు సభ్యులు, భారత ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. భారమైన హృదయంలో నేను ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నాని ప్రకటిస్తున్నా' అని శ్రీశాంత్‌ ట్వీట్లు చేశాడు.

'ఐసీసీ నన్నెంతో గౌరవించింది. 25 ఏళ్ల కెరీర్‌లో ఒక క్రికెటర్‌గా ఎన్నో విజయాలు చవిచూశాను. ఎన్నో మ్యాచులను గెలిపించాను. ఎంతో కఠినంగా సన్నద్ధమయ్యాను. నా జీవితంలో ఇదో కఠినమైన రోజు. అదే విధంగా నా కృతజ్ఞతను తెలియజేసేందుకు ఓ మంచి సందర్భం. ఈసీసీ, ఎర్నాకుళం జిల్లా, వేర్వేరు లీగులు, టోర్నమెంటు జట్లు, కేరళ క్రికెట్‌ సంఘం, బీసీసీఐ, వార్విక్‌షైర్‌ కౌంటీ, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ క్రికెట్‌ టీమ్‌, బీపీసీఎల్‌, ఐసీసీకి ధన్యవాదాలు' అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

శ్రీశాంత్‌ టీమ్‌ఇండియా తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 27 టెస్టుల్లో 37 సగటుతో 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 33 సగటుతో 75, 10 టీ20ల్లో 41 సగటుతో 7 వికెట్లు తీశాడు. 74 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 213, 92 లిస్ట్‌ ఏ మ్యాచుల్లో 124, మొత్తంగా 65 టీ20ల్లో 54 వికెట్లు తీశాడు. 2005, అక్టోబర్లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు 2011, ఆగస్టు 22న చివరి టెస్టు ఆడాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నిషేధం లేకుంటే ఇండియాలోని అత్యుత్తమ పేసర్లలో అతడూ ఒకడయ్యేవాడు!

Published at : 09 Mar 2022 08:09 PM (IST) Tags: Team India retirement Sreesanth Sreesanth retirement news

సంబంధిత కథనాలు

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్