News
News
X

KS Bharat: తెలుగు తేజంపై విపరీతమైన ట్రోల్స్ - ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నీ సెట్!

సోషల్ మీడియాలో కేఎస్ భరత్‌పై బాగా ట్రోల్స్ వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Social Media Reactions On KS Bharat: ఇండోర్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ విధంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు తొలి విజయం సాధించింది.

అయితే ఈ పరాజయం పాలైనప్పటికీ సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. కానీ ఇండోర్ టెస్టులో ఓటమి తర్వాత అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాలో భారతీయ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి తరువాత అభిమానులు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను గుర్తు చేసుకున్నారు.

కేఎస్ భరత్ పై అభిమానుల ఆగ్రహం
అయితే ఇండోర్‌లో ఓటమి తర్వాత వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాలో కేఎస్ భరత్ పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. నిజానికి రిషబ్ పంత్ గైర్హాజరీలో జట్టులో సుస్థిరమైన చోటు సంపాదించడానికి కేఎస్ భరత్‌కు గొప్ప అవకాశం ఉంది.

కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆ అవకాశాన్ని కోల్పోతున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు కేఎస్ భరత్‌పై తమ విమర్శలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ సరైన ఇన్నింగ్స్ ఒక్కటి పడితే విమర్శకుల నోళ్లు మూతపడతాయి.

సిరీస్‌లో కేఎస్ భరత్ ఫ్లాప్ షో
కేఎస్ భరత్ కెరీర్‌ను పరిశీలిస్తే ఈ బ్యాట్స్‌మెన్ భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కేఎస్ భరత్ మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 14.25 సగటుతో 57 పరుగులు చేశాడు. అదే సమయంలో ఈ బ్యాట్స్‌మన్ అత్యుత్తమ స్కోరు 23 పరుగులుగా ఉంది.

ఇండోర్‌లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి 76 పరుగులు చేయాల్సి ఉంది. కంగారూ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టుకు ఇదే తొలి విజయం.

ఇండోర్‌ టెస్టులో ఆసీస్‌  కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ (Steve Smith), వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ ఓ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. చాలాసార్లు బంతి అందుకోగానే కేరీ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. ఫలితంగా డీఆర్‌ఎస్‌లు (DRS) కోల్పోకుండా చూసుకున్నారు! సాధారణంగా వికెట్‌ కీపర్‌ క్యాచ్‌ అందుకున్నాక డౌట్‌ ఉంటే డీఆర్‌ఎస్‌ తీసుకోవాలి. అందులో ఔటని తేలకపోతే సమీక్ష పోయినట్టే! దీన్నుంచి బయట పడేందుకు కేరీ క్యాచ్‌ అందుకోగానే బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. ఇలాంటి పక్షంలో మూడో అంపైర్‌ మొదట క్యాచ్‌ అవుట్‌, తర్వాత స్టంపౌట్‌ను తనిఖీ చేస్తారు. ఒకవేళ బ్యాటర్‌ క్యాచౌట్‌ అయితే లక్కీగా వికెట్‌ దొరుకుతుంది. రివ్యూ తీసుకోలేదు కాబట్టి డబుల్‌ హ్యాపీ!

ఇదే విషయాన్ని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ మీడియాకు వివరించాడు. 'నిబంధనల పుస్తకంలో ఓ లూప్‌హోల్‌ ఉంది. స్టంపింగ్‌ అప్పీల్‌ చేసినప్పుడు ఫీల్డ్‌ అంపైర్‌ మూడో అంపైర్‌ను సాయం కోరితే అన్నీ పరిశీలించాల్సి వస్తుంది. ముందుగా బ్యాటుకు బంతి తగిలిందో లేదో గమనిస్తారు. ఈ సంగతి తెలుసు కాబట్టే వాళ్లు నిస్సిగ్గుగా ఉపయోగించుకున్నారు. ఇందుకు రెండు పరిష్కారాలు ఉన్నాయి. ఫీల్డ్‌ అంపైర్‌కు బ్యాటర్‌ ఔట్‌ కాలేదన్న పూర్తి విశ్వాసం ఉంటే మూడో అంపైర్‌ను సంప్రదించొద్దు. లేదంటే టీవీ అంపైర్‌ కేవలం స్టంపౌట్‌ మాత్రమే పరిశీలించాలి. ఫీల్డింగ్‌ కెప్టెన్‌ డీఆర్‌ఎస్‌ తీసుకుంటే తప్ప క్యాచౌట్‌ను తనిఖీ చేయొద్దు. క్యాచౌటైనా, ఎల్బీ అయినా ఇలాగే చేయాలి' అని అన్నాడు.

Published at : 03 Mar 2023 11:36 PM (IST) Tags: Rishabh Pant KS Bharat Ind vs Aus IND vs AUS 3rd test Indore Test Social Media Reactions

సంబంధిత కథనాలు

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW: ఫైనల్‌కు చేరాలంటే యూపీ కొండను కొట్టాల్సిందే - భారీ లక్ష్యాన్ని ఉంచిన ముంబై!

MIW Vs UPW: ఫైనల్‌కు చేరాలంటే యూపీ కొండను కొట్టాల్సిందే - భారీ లక్ష్యాన్ని ఉంచిన ముంబై!

MIW Vs UPW Toss: ఎలిమినేటర్‌లో టాస్ గెలిచిన యూపీ - మొదట బౌలింగ్‌కే మొగ్గు!

MIW Vs UPW Toss: ఎలిమినేటర్‌లో టాస్ గెలిచిన యూపీ - మొదట బౌలింగ్‌కే మొగ్గు!

గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్! మరి హార్ధిక్ పాండ్యా పరిస్థితేంటి?

గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్! మరి హార్ధిక్ పాండ్యా  పరిస్థితేంటి?

టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌తో కలిసి క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని

టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌తో కలిసి క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!