Singapore Open Final 2022: చరిత్ర సృష్టించిన సింధు, సింగపూర్ ఓపెన్ విజేతగా తెలుగు తేజం

Singapore Open Final 2022: ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు తన ప్రత్యర్థి వాంగ్ ఝిపై విజయం సాధించి కెరీర్‌లో తొలి సింగపూర్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

FOLLOW US: 

సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చరిత్ర సృష్టించారు. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ సాధించారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు తన ప్రత్యర్థి వాంగ్ ఝిపై విజయం సాధించి కెరీర్‌లో తొలి సింగపూర్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్లో 21-19, 11-21, 21-15 తేడాతో ప్రపంచ 11 ర్యాంకర్, చైనా షట్లర్ వాంగ్ ఝిపై విజయం సాధించింది సింధు. తద్వారా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచారు. ఈ ఏడాది స్విస్ ఓపెన్, సయ్యద్ మోదీ లాంటి సూపర్ 300 కేటగిరీ టోర్నీలు నెగ్గిన సింధు.. తాజాగా సూపర్ 500 కేటగిరి టైటిల్‌ను అందుకున్నారు.

గేమ్ ప్లాన్ మార్చిన సింధు.. 
ఒత్తిడిని జయించిన పీవీ సింధు  తొలి గేమ్‌ను పోరాడి నెగ్గారు. చివరి నిమిషంలో ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా 21-19తో తొలి గేమ్ సింధు గెలిచారు. ఆపై రెండో గేమ్ లో చైనాకు చెందిన సింధు ప్రత్యర్ధి వాంగ్ ఝి పుంజుకుంది. వరుస పాయింట్లు సాధిస్తూ సింధును ఒత్తిడిలోకి నెట్టింది. అయితే ప్రత్యర్ధి టెక్నిక్, బలాన్ని గమనిస్తున్న సింధు గేమ్ కోల్పోయింది కానీ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. మూడో గేమ్‌ను 21-15తో నెగ్గి సింగపూర్ ఓపెన్ ను తన ఖాతాలో వేసుంది సింధు. ఆమె కెరీర్‌లో ఇదే తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్ కావడంతో తెలుగు తేజం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

మూడో భారత ప్లేయర్‌గా రికార్డ్..
గతంలో ఇద్దరు భారత ప్లేయర్లు ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ లో విజేతలుగా నిలిచారు. తాజాగా పీవీ సింధు తన కెరీర్‌లో తొలి సింగపూర్ ఓపెన్‌ను సాధించారు. 2010లో సైనా సెహ్వాల్ భారత్ నుంచి సింగపూర్ ఓపెన్ నెగ్గిన తొలి ప్లేయర్ గా నిలవగా.. 2017లో సాయి ప్రణీత్ మరోసారి భారత్‌ను ప్రతిష్టాత్మక ఓపెన్‌లో విజేతగా నిలిపారు. 2022లో నేడు జరిగిన మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ ఝిపై సింధు అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో ఈ ప్రతిష్టాతక ఓపెన్‌లో సరికొత్త విజేతగా అవతరించారు.   

Also Read: Virat Kohli Reply Babar Azam: బాబర్‌ ఆజామ్‌ ట్వీట్‌కు వెరైటీగా బదులిచ్చిన కోహ్లీ!

Also Read: IND vs ENG: 1000 రోజులుగా 100 కరవు! ఆడుతోంది నిజంగా కోహ్లీయేనా అని డౌటు!!

Published at : 17 Jul 2022 11:59 AM (IST) Tags: PV Sindhu singapore Open Singapore Open Final 2022 Singapore Open Final Singapore Open 2022 PV sindhu in Singapore Open

సంబంధిత కథనాలు

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

వందకే ఆలౌట్ అయిన వెస్టిండీస్ - 88 పరుగులతో టీమిండియా విక్టరీ!

వందకే ఆలౌట్ అయిన వెస్టిండీస్ - 88 పరుగులతో టీమిండియా విక్టరీ!

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

భారీ స్కోరు చేసిన టీమిండియా - అర్థ సెంచరీతో మెరిసిన శ్రేయస్!

భారీ స్కోరు చేసిన టీమిండియా - అర్థ సెంచరీతో మెరిసిన శ్రేయస్!

INDW vs AUSW CWG 2022 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - గోల్డ్ కోసం దేనికైనా రెడీ అన్న హర్మన్!

INDW vs AUSW CWG 2022 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - గోల్డ్ కోసం దేనికైనా రెడీ అన్న హర్మన్!

టాప్ స్టోరీస్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది