అన్వేషించండి

IND vs ENG: 1000 రోజులుగా 100 కరవు! ఆడుతోంది నిజంగా కోహ్లీయేనా అని డౌటు!!

Virat kohli: విరాట్‌ కోహ్లీ..! అంతర్జాతీయ క్రికెట్లో మంచినీళ్ల ప్రాయంగా సెంచరీలు కొట్టిన ఆటగాడు! ఏమైందో తెలియదు. మూడేళ్లుగా ఏ ఫార్మాట్లోనూ శతకం అందుకోలేదు.

IND vs ENG, Virat Kohli: విరాట్‌ కోహ్లీ..! అంతర్జాతీయ క్రికెట్లో మంచినీళ్ల ప్రాయంగా సెంచరీలు కొట్టిన ఆటగాడు! ఏమైందో తెలియదు. మూడేళ్లుగా ఏ ఫార్మాట్లోనూ శతకం అందుకోలేదు. ఒకవేళ అతడు ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలోనూ మూడంకెల స్కోరు అందుకోకపోతే కోరుకోని రికార్డును ఖాతాలో వేసుకుంటాడు. 1000 రోజులుగా 100 కొట్టని ఆటగాడిగా మిగులుతాడు.

ఇంటర్నేషనల్‌ క్రికెట్లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) 2019, నవంబర్‌ 13న చివరి సెంచరీ కొట్టాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన గులాబి టెస్టులో శతకబాదాడు. 136 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది 70వ శతకం. ఆ తర్వాత సిరీసులోనే ఒకట్రెండు శతకాలు బాదేసి రికీ పాంటింగ్‌ 71 సెంచరీల రికార్డు బద్దలు కొట్టేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇప్పుడు మూడేళ్లు గడుస్తున్నాయి. ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసాయే తప్ప విరాట్‌ బ్యాటు నుంచి వంద రాలేదు.

Also Read: బాబర్‌ ఆజామ్‌ ట్వీట్‌కు వెరైటీగా బదులిచ్చిన కోహ్లీ!

ఇంగ్లాండ్‌ సిరీసులోనూ విరాట్‌ ఎక్కువ పరుగులు చేయలేదు. టెస్టులో 11, 20 చేశాడు. రెండో టీ20లో ఒక పరుగుకే పెవిలియన్‌ చేరాడు. మూడో టీ20లో 11 పరుగులకు ఔటయ్యాడు. గజ్జల్లో గాయంతో తొలి వన్డేకు దూరమయ్యాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచులో 16 కొట్టాడు. ఒకవేళ మాంచెస్టర్లో మూడో వన్డేలో గనక మూడంకెల స్కోరు చేయకపోతే అనవసర రికార్డు అందుకోవాల్సి వస్తుంది. 1000 రోజులుగా సెంచరీ కొట్టని క్రికెటర్‌గా ఉంటాడు. 

ఎందుకంటే ఈ సిరీస్‌ తర్వాత అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక చేయలేదు. పనిభారం ఒకటైతే మానసిక విశ్రాంతి మరొక కారణం. కరీబియన్‌ దీవుల నుంచి తిరిగొచ్చాక టీమ్‌ ఇండియా ఆసియా కప్‌లో తలపడుతుంది. అందుకోసం విరాట్‌ ఆగస్టు 19 వరకు ఆగాల్సి ఉంటుంది. అందుకే మాంచెస్టర్లోనే కింగ్‌ కోహ్లీ తన మునుపటి ఫామ్‌ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఛేదనలో విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు హడలెత్తిపోయేవాళ్లు. అతడిని ఎలా ఔట్‌ చేయాలో అని సతమతం అయ్యేవాళ్లు. అతడికి బంతులేసేందుకు భయపడేవాళ్లు. అలాంటిది రెండున్నరేళ్లుగా విరాట్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అడపాదడపా హాఫ్‌ సెంచరీలు చేస్తున్నా, మిగతా క్రికెటర్లతో పోలిస్తే సగటు బాగున్నా. తన మునుపటి స్థాయి అందుకోవడం లేదు.

ఇప్పటి వరకు 102 టెస్టులాడిన కోహ్లీ 50 సగటుతో 8074 పరుగులు చేశాడు. 261 వన్డేల్లో 57 సగటుతో 12327, 99 టీ20ల్లో 50 సగటుతో 3308 రన్స్‌ సాధించాడు. రెండు ఫార్మాట్లలో కలిసి 70 సెంచరీలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఏటా 2000 రన్స్‌ చేసే కింగ్‌ కోహ్లీ 2020లో 842, 2021లో 964, 2022లో 459 మాత్రమే సాధించాడు. అతడు త్వరగా ఫామ్‌ అందుకోవాలని అభిమానులు, టీమ్‌ఇండియా కోరుకుంటోంది.

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget