News
News
X

Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

Shoaib Malik Sania Mirza: సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న రూమర్లతో వారిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు నేడు షోయబ్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Shoaib Malik Sania Mirza:  భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. విడాకుల ప్రక్రియ ముగిసిందని.. కొన్ని చట్టపరమైన అంశాలు పరిష్కరించుకుని వారు అధికారికంగా ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంచితే సోమవారం అర్ధరాత్రి షోయబ్ మాలిక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

ఏంటా పోస్ట్

నేడు సానియా మీర్జా పుట్టినరోజు. ఇది పురస్కరించుకుని మాలిక్ తన భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు. వారిద్దరూ కలిసి ఉన్న చక్కని ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. దానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ రోజును పూర్తిగా ఆస్వాదించండి. అంటూ క్యాప్షన్ జతచేశాడు.

News Reels

View this post on Instagram
 
A post shared by Shoaib Malik (@realshoaibmalik)

ఫ్యాన్స్ ఆనందం

షోయబ్ ఆ పోస్ట్ పెట్టిన వెంటనే అతని అనుచరులు, ఫ్యాన్స్ దానిపై వ్యాఖ్యానించారు. మీరిద్దరూ కలిసి ఉండాలని వారు సూచించారు. అలాగే కేవలం 50 నిమిషాల్లో ఆ పోస్టుకు 47 వేల లైక్స్ వచ్చాయి. 

భర్త లేకుండా సానియా జన్మదిన వేడుకలు

మరోవైపు సానియా మీర్జా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. తన స్నేహితుల సమక్షంలో దుబాయ్ లో అర్ధరాత్రి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేసుకుంది. బాలీవుడు దర్శకురాలు ఫరా ఖాన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ వేడుకలో షోయబ్ మాలిక్ కనిపించలేదు. దీంతో వారి విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయింది.

కలిసి టాక్ షో

సానియా-షోయబ్ ల విడాకుల వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానం కలుగుతోంది. పాకిస్థాన్ కు చెందిన ఉర్దూ ఓటీటీ వేదిక ఉర్దూఫ్లిక్స్ కోసం ఈ జంట 'ది మీర్జా మాలిక్ షో' అనే టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించి సానియా, షోయబ్ భుజం మీద చేయి వేసి దిగిన ఫొటోను ఉర్దూఫ్లిక్స్ పోస్టు చేసింది. ఈ షో త్వరలోనే ప్రసారం అవుతుందని సదరు ఓటీటీ ప్రకటించింది.

విడాకుల వ్యవహారాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ విచిత్రంగా ఇప్పుడు నెటిజన్లు ఈ జంటను విమర్శిస్తున్నారు. ఈ దంపతులు ప్రచారం కోసమే విడాకుల నాటకాలు ఆడుతున్నారంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ షో షూటింగ్ గతంలోనే జరిగి ఉంటుందని.. ప్రసారానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే విడాకుల ప్రకటన వాయిదా వేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం విడాకులపై ఈ జంట అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చని మరికొంతమంది అంటున్నారు. 

View this post on Instagram
 
A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

Published at : 15 Nov 2022 08:05 PM (IST) Tags: Sania Mirza Shoaib Malik Sania Shoaib divorce Sania Shoaib divorce news Sania Shoiab Sania Mirza birthday Shoiab wishes sania

సంబంధిత కథనాలు

ICC Cricket WC 2023: ప్రయోగాలకు సమయం లేదు, సన్నద్ధత మొదలుపెట్టాల్సిందే: మహమ్మద్ కైఫ్

ICC Cricket WC 2023: ప్రయోగాలకు సమయం లేదు, సన్నద్ధత మొదలుపెట్టాల్సిందే: మహమ్మద్ కైఫ్

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్- నేడు ఆతిథ్య ఖతార్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 

FIFA World Cup 2022:  ఫిఫా ప్రపంచకప్- నేడు ఆతిథ్య ఖతార్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 

Viral Video: 'చాహల్ ను కూలీగా మార్చిన ధనశ్రీ వర్మ'- శిఖర్ ధావన్ సెటైర్లు

Viral Video: 'చాహల్ ను కూలీగా మార్చిన ధనశ్రీ వర్మ'-  శిఖర్ ధావన్ సెటైర్లు

FIFA WC 2022: ఉరుగ్వే పై విజయం- రౌండ్ ఆఫ్ 16కు పోర్చుగల్

FIFA WC 2022: ఉరుగ్వే పై విజయం- రౌండ్ ఆఫ్ 16కు పోర్చుగల్

Germany Vs Spain: ఫిఫా ప్రపంచకప్- స్పెయిన్- జర్మనీ మ్యాచ్ డ్రా

Germany Vs Spain: ఫిఫా ప్రపంచకప్- స్పెయిన్- జర్మనీ మ్యాచ్ డ్రా

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్