News
News
వీడియోలు ఆటలు
X

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండు పతకాలు సాధించింది.

FOLLOW US: 
Share:

Womens World Boxing Championship, Saweety Boora: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నీతూ ఘంఘాస్ తర్వాత సవీటీ బూరా కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది. 81 కేజీల విభాగంలో సవీటీ బూరా బంగారు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాను సవీటీ బూరా ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. అంతకు ముందు మంగోలియన్ బాక్సర్‌ను ఓడించి నీతు ఘంఘాస్ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. ఇప్పుడు సవీటీ బూరా చైనా క్రీడాకారిణిని ఓడించి రెండో స్వర్ణ పతకాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది. నీతూ ఘంఘాస్ 48 కిలోల బరువు విభాగంలో స్వర్ణం సాధించింది.

భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన నీతూ ఘంఘాస్
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నీతూ ఘంఘాస్ స్వర్ణ పతకం సాధించింది. 48 కేజీల వెయిట్ విభాగంలో మంగోలియాకు చెందిన లుత్సేఖాన్ అల్టెంగ్‌సెంగ్‌పై నీతూ ఘంఘాస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బాక్సర్ 5-0తో విజయం సాధించడం విశేషం. అంతకు ముందు శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కజకిస్థాన్ బాక్సర్‌ను నీతూ ఘన్‌ఘాస్ ఓడించింది. ఆ తర్వాత సవీటీ బూరా భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించింది.

నిఖత్ జరీన్, లోవ్లినా బోర్హాగెన్ ఆదివారం ఫైనల్స్‌లోకి
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు నిఖత్ జరీన్, లోవ్లినా బోర్హాగెన్ కూడా చేరుకున్నారు. మార్చి 26వ తేదీన జరిగే ఫైనల్‌లో నిఖత్ జరీన్, లోవ్లినా బోర్హాగన్ పోటీపడనున్నారు.ఈ విధంగా నలుగురు భారత బాక్సర్లు మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకోగలిగారు. నీతూ ఘంఘాస్‌తో పాటు సవీటీ బూరా, నిఖత్ జరీన్, లోవ్లినా బోర్హెగన్ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నారు. అయితే నీతూ ఘంఘాస్, సవీటీ బూరా తర్వాత, భారతీయ అభిమానుల దృష్టి నిఖత్ జరీన్, లోవ్లినా బోర్హెగన్‌లపైనే ఉంటుంది.

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల  బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్   జోరు కొనసాగుతోంది.  50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న ఈ ఇందూరు (నిజామాబాద్) బాక్సర్..   ముగిసిన సెమీఫైనల్స్ లో 5-0 తేడాతో 2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్  వలెన్సియాను చిత్తుగా ఓడించి మరో పసిడి పతకానికి అడుగుదూరంలో నిలిచింది. 

కొలంబియాకు చెందిన  ఇన్‌గ్రిత్  వలెన్సియా.. టోక్యో ఒలింపిక్స్ లో  భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ను  ఓడించింది.  ఆమె ఆట గురించి అవగాహన ఉన్న  నిఖత్..  వలెన్సియాను తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడింది. ఆమె తనపై ఆధిపత్యం ప్రదర్శించకుండా  చూసుకుంటూ  విజయం సాధించింది.  కాగా  ఈ విజయంతో నిఖత్.. ఆదివారం జరుగబోయే ఫైనల్స్ లో వియాత్నాం బాక్సర్ .. ఎన్గుయోన్ థి టామ్ తో  తలపడనుంది. 

గతేడాది ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా జరిగిన  వరల్డ్ సీనియర్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆడిన నిఖత్ జరీన్ వరుసగా   రెండోసారి తుది పోరుకు అర్హత సాధించడం గమనార్హం. మేరీ కోమ్ తర్వాత  ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్ మన తెలంగాణ అమ్మాయే. మేరీ కోమ్ వరుసగా ఆరుసార్లు ఫైనల్స్ కు వెళ్లింది. మొత్తంగా ఏడుసార్లు ఫైనల్స్ కు అర్హత సాధించి ఆరు స్వర్ణాలు సాధించింది.  గతేడాది నిఖత్..  5-0 తేడాతో థాయ్‌లాండ్ కు చెందిన  జిట్పాంగ్ ను ఓడించి  పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  ఈ క్రమంలో ఆమె వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి తెలుగు, తెలంగాణ అమ్మాయిగా   చరిత్ర సృష్టించింది. దీంతో పాటు  నిఖత్ జరీన్.. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ లో కూడా స్వర్ణం సాధించిన విషయం  తెలిసిందే. వరుస పోటీలలో  స్వర్ణాలు నెగ్గుతున్న జరీన్..  వచ్చే ఏడాది  జరుగబోయే పారిస్ ఒలింపిక్స్ లో కూడా  స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

Published at : 26 Mar 2023 03:04 AM (IST) Tags: Nitu Gangas Women World Boxing Championship Saweety Boora

సంబంధిత కథనాలు

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!

French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!

WTC Final 2023: చీటర్స్ చీటర్స్ అంటూ హోరెత్తుతున్న ఓవల్ - గిల్ వివాదాస్పద ఔట్‌పై ట్విటర్‌లో ఆగ్రహం

WTC Final 2023: చీటర్స్ చీటర్స్ అంటూ హోరెత్తుతున్న ఓవల్ - గిల్ వివాదాస్పద ఔట్‌పై ట్విటర్‌లో ఆగ్రహం

WTC Final 2023: హెడ్‌కోచ్‌గా ద్రావిడ్ జీరో- టీమిండియాను దేవుడే కాపాడాలి - పాక్ మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్

WTC Final 2023: హెడ్‌కోచ్‌గా ద్రావిడ్ జీరో- టీమిండియాను దేవుడే కాపాడాలి - పాక్ మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్

Bumrah Comeback: బుమ్రా కమ్‌బ్యాక్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన దినేశ్ కార్తీక్ - పేస్ గుర్రం ఎంట్రీ అప్పుడే!

Bumrah Comeback: బుమ్రా కమ్‌బ్యాక్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన దినేశ్ కార్తీక్ - పేస్ గుర్రం ఎంట్రీ అప్పుడే!

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !