Satwik-Chirag: వరల్డ్ నెంబర్ వన్ మనమే, సత్తా చాటిన సాత్విక్-చిరాగ్ శెట్టి
Satwik-Chirag: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
World No1 Badminton Ranking: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్(World no1 badminton ranking) కైవసం చేసుకుని తమకు తిరుగులేదని ఇంకొకసారి నిరూపించారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ జోడీ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుచుంది. ఈ సీజన్‌లో ఆడిన మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్‌లల్లో ఈ జోడి రన్నరప్‌గా నిలిచిన ఈ జంట ఏడాదిన్నర తర్వాత తిరిగి టాప్‌కు చేరింది. సింగిల్స్‌లో ప్రణయ్ 8వ ర్యాంక్ దక్కించుకోగా లక్ష్యసేన్ 19వ స్థానంలో నిలిచాడు.
ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో....
భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి(Chirag Shetty and Rankireddy) సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచారు. టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయినా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. డబుల్స్ సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు... మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌లపై సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించింది. 21-18 21-14తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో రెండో గేమ్‌లో చివరి 12 పాయింట్లలో 11 పాయింట్లు గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడి విజయం సాధించింది. పైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి... మూడో సీడ్, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సీయుంగ్ జేలతో తలపడతారు.
మలేసియా ఓపెన్ వరల్డ్ టోర్నీలోనూ....
మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament) ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ప్రపంచ రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి... 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ జోడీ వాంగ్ – లియాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో భారత జోడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చైనా మస్టర్స్‌లోనూ ఓటమిపాలు
సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీ చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ తుదిపోరులో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆడిన ఆడిన అయిదు ఫైనల్లోనూ వరుస విజయాలు సాధించిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి తొలిసారి తుది మెట్టుపై బోల్తా పడింది. చివరివరకూ పోరాడినా... ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించినా ఈ స్టార్ జోడీకి ఓటమి తప్పలేదు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్- చిరాగ్ జంట 19-21, 21-18, 19-21 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్ లియాంగ్- వాంగ్ చేతిలో పోరాడి ఓడింది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో భారత ద్వయం అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.