అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియోపై కేసు,వివరాలు వెల్లడించని పోలీసులు

Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Sachin Tendulkar Deepfake Video: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గేమింగ్ సైట్ , ఫేస్ బుక్పేజీపై కేసు పెట్టారు. "స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్" అనే గేమింగ్ యాప్ కోసం సచిన్ ప్రచారం చేసినట్లు వీడియో రూపొందించి గేమింగ్ సైట్ తోపాటు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సచిన్, ఆయన కుమార్తె సారా గేమ్ ఆడి భారీగా ఆర్జించినట్లు కల్పిత వీడియోను సృష్టించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని సచిన్ స్వయంగా ఇటీవల వివరణ ఇచ్చారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం బాధకలిగిస్తోందని చెప్పారు. ఆ గేమింగ్ యాప్ యజమాని వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

ఇంతకీ ఏం జరిగిందంటే..? 
క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో బారిన పడడం సంచలనం రేపుతోంది. స్వయంగా సచినే ఆ వీడియాలు ఉంది తాను కానని చెప్పాల్సి వచ్చింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్ వైరల‌్ కావడంతో అది చివరికి సచిన్‌కు చేరింది. స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్‌ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ గాడ్‌ స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆందోళన కలిగిస్తోందన్న సచిన్‌
ఈ వీడియోలు నకిలీవని సచిన్ స్పష్టం చేశాడు. సాంకేతికతను ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నాడు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని అభిమానులకు సూచించాడు. సోషల్‌ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ.. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సచిన్‌ అన్నాడు. డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని సచిన్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీశాఖ మంత్రి, మహారాష్ట్ర సైబర్‌ విభాగ అకౌంట్లకు ట్యాగ్‌ చేశాడు.

త్వరలోనే కఠిన చట్టాలు
కృత్రిమ మేధ సాంకేతికతతో రూపొందించే డీప్‌ఫేక్‌ వీడియో(Deepfake Video)లను కట్టడి చేసేందుకు త్వరలోనే పటిష్ఠమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ (Union minister Rajeev Chandrasekhar)తెలిపారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar) డీప్‌ఫేక్‌ వీడియో బారిన పడటంపై స్పందించిన మంత్రి.. ఏఐ, డీప్‌ఫేక్‌ సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డీప్‌ఫేక్‌ వీడియోలు సమాజానికి ప్రమాదకరమనీ.. యూజర్లకు హాని చేయడంతోపాటు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. కాగా.. గతేడాది నవంబరులో డీప్‌ఫేక్‌లపై సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget