అన్వేషించండి
Advertisement
Sachin Tendulkar: డీప్ ఫేక్ బారిన సచిన్ ,స్పందించిన క్రికెట్ గాడ్
Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడడం సంచలనం రేపుతోంది. స్వయంగా సచినే ఆ వీడియాలు ఉంది తాను కానని చెప్పాల్సి వచ్చింది.
రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో(deepfake video ) ఘటన మర్చిపోకముందే క్రికెట్ గాడ్ సచిన్(Sachin Tendulkar) డీప్ ఫేక్ వీడియో బారిన పడడం సంచలనం రేపుతోంది. స్వయంగా సచినే ఆ వీడియాలు ఉంది తాను కానని చెప్పాల్సి వచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్ వైరల‌్ కావడంతో అది చివరికి సచిన్‌కు చేరింది. స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’ పేరుతో ఉన్న గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్ మీడియాలో క్రికెట్ గాడ్ స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆందోళన కలిగిస్తోందన్న సచిన్
ఈ వీడియోలు నకిలీవని సచిన్ స్పష్టం చేశాడు. సాంకేతికతను ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నాడు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని అభిమానులకు సూచించాడు. సోషల్ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ.. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సచిన్ అన్నాడు. డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని సచిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీశాఖ మంత్రి, మహారాష్ట్ర సైబర్ విభాగ అకౌంట్లకు ట్యాగ్ చేశాడు. ఇటీవల సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. టీమ్‌ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ఉన్నట్లు మార్ఫింగ్ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, కొంతమంది తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, వాటిని నమ్మొద్దని తెలిపారు.
సారా పేరున నకిలీ అకౌంట్
కొంతకాలంగా సారా టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనన్నట్లుగా గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సారా కేరింతలు కొడుతూ అతడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో సారా పేరిట ఉన్న ఖాతాల్లో గిల్ పై ప్రేమ ఉన్నట్లు పలు ఫోటోలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. దీనిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన సారా టెండూల్కర్ తొలిసారి స్పందించింది. తన పేరిట జరుగుతున్న దుష్ప్రచారంపై సారా ఆవేదన వ్యక్తం చేసింది. అసలు తనకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఎలాంటి అకౌంటే లేదని స్పష్టం చేసింది. డీప్ ఫేక్ ఫొటోలతో కొంతమంది కావాలనే తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సారా ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరుతో ఎక్స్‌లో ఉన్న అకౌంట్ ఫోటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎక్స్‌లో సారా పేరిట ఉన్న నకిలీ ఖాతాకు బ్లూటిక్ మార్క్ ఉండటంతో ఇదే సారా నిజమైన అకౌంట్ అని భావించి.. ఈ అంశమై మీడియా కథనాలు కూడా రాసింది. ఈ నేపథ్యంలో తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ నుంచి జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సారా టెండూల్కర్ స్పందించింది. ఎక్స్‌లో తనకు అకౌంటే లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టి సారా ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ అకౌంట్లను వెంటనే తొలగించాలని ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు సారా విజ్ఞప్తి చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion