Praggnanandhaa Beats Gukeshs: బ్లిట్జ్ లో గుకేశ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద- మళ్లీ టాప్‌లోకి మాగ్నస్ కార్ల్‌సన్
Super United Rapid and Blitz Chess Tournament | వరల్డ్ ఛాంపియన్ గుకేష్ వేగంగా ఆధిపత్యం చెలాయించినా బ్లిట్జ్ విభాగంలో ఆర్ ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయాడు. కార్ల్‌సన్ 17.5 పాయింట్లతో ముందున్నాడు.

Magnus Carlsen | జాగ్రెబ్ (క్రొయేషియా): ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్ కు సహచర భారత ఆటగాడు ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) షాకిచ్చాడు. వరల్డ్ నెంబర్ వన్, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి జోరుమీదున్న గుకేశ్‌ను మరో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఓడించాడు. ఈ ఓటమితో క్రొయేషియా వేదికగా జరుగుతున్న సూపర్ యునైటెడ్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ లో గుకేశ్ (D Gukesh) 15.5 పాయింట్లతో మాగ్నస్ కార్ల్‌సెన్ కంటే 2 పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు. ఒకవేళ ప్రజ్ఞానందపై విజయం సాధించింటే గుకేశ్ టైటిల్ రేసుకు మరింత చేరువయ్యేవాడు.
ప్రజ్ఞానంద చేతిలో ఓటమి
రెండవ రోజు ముగిసే సమయానికి దాదాపు అందరి డిఫెన్స్ ను ఛేదించి, 3 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించిన తరువాత, భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ పట్టు కోల్పోయాడు. బ్లిట్జ్ విభాగంలో ఐదు ఓటములతో ప్రారంభించిన గుకేశ్, ఆరవ గేమ్‌ను డ్రాగా ముగించాడు. కానీ ఏడవ గేమ్‌లో ఓటమి తప్పలేదు. ఎనిమిదవ గేమ్‌లో గెలిచినప్పటికీ, గుకేశ్ మరో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయాడు.
నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్‌సెన్ తన తొమ్మిది గేమ్‌లలో 7.5 పాయింట్లు సాధించి మళ్ళీ టాప్ పొజిషన్ లోకి వచ్చాడు. గత ఎడిషన్‌లో, ఈ నార్వే ప్లేయర్ తన చివరి 9 గేమ్‌లను గెలిచి ఛాంపియన్‌గా నిలిచాడు.
టైటిల్ కోసం ఎదురుచూస్తున్న గుకేశ్
గ్రాండ్ మాస్టర్ గుకేశ్ రాపిడ్ విభాగంలో తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతను కార్ల్‌సెన్‌తో సహా ఆరు గేమ్‌లలో నెగ్గాడు. కానీ బ్లిట్జ్‌లో ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. ఆట ఫాస్టెస్ట్ వెర్షన్ ప్రారంభ రోజున ఆరు గేమ్‌లను కోల్పోయాడు. చివరి రోజున ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతానికి, కార్ల్‌సెన్ 27 పాయింట్లకు గాను 17.5 పాయింట్లతో టైటిల్ కోసం స్ట్రాంగ్ ప్లేయర్‌గా గుకేశ్ ఉన్నాడు. పోలాండ్‌కు చెందిన డుడా జాన్- క్రిజ్‌స్టోఫ్ కంటే 1.5 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. బ్లిట్జ్ తొలిరోజున కూడా బాగా రాణించాడు.
దూసుకెళ్తున్న డిఫెండింగ్ ఛాంపియన్
బ్లిట్జ్ విభాగంలో ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉండగా, కార్ల్‌సన్ మిగిలిన గేమ్‌లలో 6 పాయింట్లు సాధించడం ద్వారా గెలిచే అవకాశాలున్నాయి. అయితే గుకేశ్ ఈ విధానంలో సరిగ్గా ఆడనందున చాలా మెరుగ్గా ఆడక తప్పదు. కార్ల్‌సన్ ఇంతకు ముందు గుకేశ్‌ను ఇతర ఫార్మాట్‌లలో స్థాయికి తగ్గట్టుగా లేడని అన్నాడు. అయితే గుకేశ్ రాపిడ్ చెస్ విభాగంలో అది తప్పు అని నిరూపించాడు. బ్లిట్జ్‌లో, ప్రపంచ ఛాంపియన్ ఇంకా తనను తాను నిరూపించుకోవాలి.
9వ రౌండ్ తర్వాత స్థానాలు ఇలా (బ్లిట్జ్): 1. మాగ్నస్ కార్ల్‌సెన్ (పోల్, 17.5); 2. డుడా జాన్-క్రిజ్‌స్టోఫ్ (పోల్ 16); 3. డి గుకేశ్ (ఇండియా, 15.5); 4. వెస్లీ సో (అమెరికా, 14.5); 5. ఆర్ ప్రజ్ఞానంద (ఇండియా, 13.5); 6-7. అలిరెజా ఫిరోజ్‌జా (ఫ్రాన్స్), ఫాబియానో కరువానా (అమెరికా) 13 చొప్పున; 8-9:. అనిష్ గిరి (నెదర్లాండ్స్) నోదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) ఒక్కొక్కరు 11; 10. ఇవాన్ సారిక్ 10.
Also Read: IND vs ENG 2nd Test: చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా! గిల్ సేనను టెన్షన్ పెడుతున్న వెదర్ రిపోర్ట్






















