అన్వేషించండి
Advertisement
PKL Season 11 auction: కూత పెట్టారు, కోట్లు పట్టారు- ప్రో కబడ్డీ వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్లు
PKL: దేశ ఆర్థిక రాజధాని వేదికగా ప్రో కబడ్డీ లీగ్ వేలం ముగిసింది. 11వ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
Pro Kabaddi League 2024 Auction Highlights: క్రికెట్‌లో ఐపీఎల్ తరహాలో కబడ్డీలో ఆరంభించిన ప్రో కబడ్డీ లీగ్(Pro Kabaddi League).... ఒకప్పుడు చిన్నగా ప్రారంభమై ఇప్పుడు మహా వృక్షంగా ఎదుగుతోంది. కబడ్డీ ఆటగాళ్ల కూతకు కోట్లు తెగుతున్నాయి. ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో ప్రాంఛైజీలు ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించేశాయి. ఈ ఏడాది జరిగిన వేలంలో ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు కోటీ రూపాయలకంటే ఎక్కువ ధర పలకడం విశేషం. గతంలో లక్షలు పెట్టేందుకు వెనకాడిన ప్రాంఛైజీలు.. ప్రో కబడ్డీ లీగ్‌కు లభిస్తున్న ఆదరణ చూసి కోట్లు పెట్టేందుకు ఏ మాత్రం వెనకడగు వేయలేదు. దేశీయ ఆటగాళ్లలో సచిన్ తల్వార్‌కు రూ.2.15 కోట్లతో అత్యధిక ధర పలకగా... విదేశీ ఆటగాళ్లలో ఇరాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్‌రెజా చియానెకు రూ.2.07 కోట్లు దక్కించుకున్నాడు. ఈసారి ఇద్దరు ఆటగాళ్లు రెండు కోట్ల రూపాయలకుపైగా అమ్ముడుపోగా... ఆరుగురు ఆటగాళ్లకు కోటీ రూపాయలకు పైగా దక్కాయి. వేలంపాట ముగియడంతో ఇక కబడ్డీ కూతకు దేశం మొత్తం సిద్ధమైపోయింది.
భారీ ధర వీరికే
సచిన్ తన్వర్‌ను తమిళ్ తలైవాస్ రూ.2.15 కోట్లకు దక్కించుకుంది. మహమ్మద్‌రెజాను హరియాణా స్టీలర్స్- రూ.2.07 కోట్లకు దక్కించుకోగా... గుమన్ సింగ్‌ను గుజరాత్ జెయింట్స్- రూ.1.97 కోట్లకు.. పవన్ సెహ్రావత్‌ను తెలుగు టైటాన్స్- రూ.1.725 కోట్లకు చేజిక్కించుకున్నాయి. యూపీ యోధాస్- రూ.1.30 కోట్లకు భరత్‌ను.. బెంగాల్ వారియర్స్- రూ.1.15 కోట్లకు మణిందర్ సింగ్‌ను కొనుగోలు చేశాయి. అజింక్య పవార్‌ను బెంగళూరు బుల్స్- రూ.1.107 కోట్లకు... సునీల్ కుమార్‌ను యు ముంబా- రూ.1.015 కోట్లకు కొనుగోలు చేశాయి.
వేలంలో 500 మంది కబడ్డీ ఆటగాళ్లు
రెండు రోజుల పాటు ముంబైలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంలో మొత్తం 500 మందికి పైగా ఆటగాళ్ల కోసం వేలం జరిగింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోయారు. కీలక ఆటగాళ్ల కోసం వేలం హోరాహోరీగా సాగింది. ఓ దశలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించేందుకు కూడా ప్రాంఛైజీలు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. సచిన్ తల్వార్ కోసమైతే హోరాహోరీగా వేలం సాగింది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జాంగ్ కున్ లీ... పాట్నా పైరేట్స్ జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చాడు. తమిళ్ తలైవాస్, యుపీ యోధాస్ తమ ఎలైట్ ప్లేయర్‌లను నిలబెట్టుకోలేదు. తమిళ్ తలైవాస్ ఏడుగురు యువ ఆటగాళ్లను, పుణెరి పల్టాన్ ఆరుగురు యువ ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకున్నారు. గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ కేవలం ఐదుగురిని మాత్రమే కొనుగోలు చేశాయి. మిగిలిన ఆటగాళ్లందరినీ రిటైన్ చేసుకున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion