Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
బ్రెజిల్‌కు చెందిన ఫుట్ బాల్ దిగ్గజం పీలే అనారోగ్యంతో కన్నుమూశారు.
Pele Dies: లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే కన్నుమూశారు. అతని కుటుంబ సభ్యులు వార్తా సంస్థ AFPకి ఈ మేరకు సమాచారం అందించారు. పీలే తన 82వ ఏట తుది శ్వాస విడిచారు. 1958, 1962, 1970లలో ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ FIFA వరల్డ్ కప్‌ను బ్రెజిల్ గెలుచుకుంది. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడు పీలేనే.
పీలే కుమార్తె కెల్లీ క్రిస్టినా నాసిమెంటో తన తండ్రి మరణం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేశారు. ఈ చిత్రంలో పీలే కుటుంబానికి చెందిన వ్యక్తులు చివరి వీడ్కోలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కీమోథెరపీ చికిత్స కోసం పీలే గత నెల చివర్లో సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో చేరాడు.
ఇటీవలి సంవత్సరాలలో ఆయన వెన్నెముక, తుంటి, మోకాలు, మూత్రపిండాలతో సహా అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఫుట్ బాల్ చరిత్రలోని ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో పీలే ఒకరు. 1940లో అక్టోబర్ 23వ తేదీన పీలే జన్మించారు.
A Magician on the field and one of the greatest sportspersons to have graced the planet. Heartfelt condolences to his family and well wishers all around the world. #Pele pic.twitter.com/FVemHsZ5FB
— Virender Sehwag (@virendersehwag) December 29, 2022
View this post on Instagram
View this post on Instagram