By: ABP Desam | Updated at : 02 Aug 2021 02:39 PM (IST)
కాంస్య పతకం సాధించిన పీవీ సింధు
ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన పీవీ సింధుకు.. తాను ఇచ్చిన హామీ మేరకు... ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనూహ్యమైన బహుమతి ఇవ్వనున్నారు. ఆ బహుమతి గురించి ప్రధాని మోడీ ముందుగానే సింధుకు చెప్పారు. ఇంతకూ అదేమిటో తెలుసా... ? ఎవరూ ఊహించనిది..! అదే ... ఐస్ క్రీమ్. అవును.. నిజంగానే ఐస్ క్రీమ్ . కొద్ది రోజుల కిందట ఒలింపిక్స్‌కు వెళ్లే ఆటగాళ్లతో ప్రధాని మోడీ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. పతకాల కోసం ఆటగాళ్లు ఎలా శ్రమిస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. పీవీ సింధుతో మాట్లాడినప్పుడు ఆమె తల్లిదండ్రులు కూడా వర్చువల్ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు... గేమ్ కోసం.. పతకం కోసం ఎంత కష్టపడుతుందో వివరించారు. ఎంత నిష్టగా ఆహార నియమాలు పాటిస్తుందో చెప్పారు. ఈ సందర్భంగా... పీవీ సింధుకు ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను కూడా చాలా కాలంగా త్యాగం చేసిందని చెప్పారు. ఈ మాట విన్న ప్రధాని మోడీ... ఒలింపిక్స్‌లో పతకం తీసుకు వస్తే... తనతో కలిసి ఐస్‌క్రీమ్ తినవచ్చునని హామీ ఇచ్చారు.
ప్రధానితో ఐస్ క్రీమ్ తినే అవకాశం కోసమైనా పతకం సాధించాలన్న పట్టుదలను ఆమెలో కల్పించేందుకు మోడీ ప్రయత్నించారు. సింధు కఠోర శ్రమ ఫలించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. దీంతో సింధు తండ్రి ఆనందానికి కూడా అవధుల్లేవు. సింధు గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన పీవీ రమణ... ఇప్పుడు సింధు.. ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీమ్ తినవచ్చునని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేకంగా విజేతల్ని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ సందర్భంగా పీవీ సింధుకు, ప్రధాని మోడీ ఐస్ క్రీమ్ ఆఫర్ చేసే అవకాశం ఉంది.
మంగళవారం లేదా బుధవారం పీవీ సింధు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. టోక్యో నుంచి వర్చువల్‌గా మీడియాతో ఇంటరియాక్ట్ అయిన పీవీ సింధు కూడా... ప్రధానమంత్రితో కలిసి ఐస్ క్రీం తినేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. ఒలింపిక్స్ తొలి రోజు రజతం గెలిచిన మీరాభాయి చానుకు పిజ్జాలంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా డామినోస్ సంస్థ జీవితాంతం ఉచితంగా పిజ్జాలు ఇస్తామని ప్రకటించింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేంద్రమంత్రిని కలిసిన సమయంలోనూ వారు పిజ్జాలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి వంతు అనుకోవచ్చు..!
Dhiraj Bommadevara: భళా! బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం
Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు
Los Angeles 2028 Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్ కన్ఫామ్, మరో 4 గేమ్స్ చేర్చుతూ నిర్ణయం
PM Modi: ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల మంది భారతీయుల కల- ప్రధాన మంత్రి మోడీ
Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్, తుది ఆమోదమే తరువాయి
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>