Paris Olympics 2024:సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి అద్భుతం చేసిన మను బాకర్- భారత్ ఖాతాలో రెండో పతకం
Manu Bhaker And Sarabjot Singh: పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ భారత్‌కు రెండో పతకం అందించారు. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శనతో పతకం కైవసం చేసుకున్నారు.
Paris Olympics 2024 India's Second Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో మను భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ భారత్‌కు రెండో పతకం సాధించి పెట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్ జ్యోత్ జోడీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కాంస్య పతకం సాధించింది. కొరియాకు చెందిన వోన్హో, ఓహ్ యే జిన్‌తో ఈ భారత జోడీ తలపడింది. ఈ మ్యాచ్ లో మను భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ 16-10 స్కోరుతో విజయం సాధించింది.
భారత్‌కు రెండో పతకం అందించిన మను భాకర్ అండ్ సరబ్ జ్యోత్ సింగ్ జోడీ
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ భారత్‌కు తొలి పతకం అందించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో మను కాంస్య పతకం సాధించింది. ఇప్పుడు కూడా భారత్‌కు రెండో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. పారిస్‌లో భారత్‌కు రెండో పతకం అందించిన మను భాకర్ కూడా ఈ విజయంతో చరిత్ర సృష్టించింది. స్వాతంత్య్రానంతరం ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు అనేక మంది భారత అథ్లెట్లు వివిధ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించినప్పటికీ, మను ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి రికార్డు బుక్‌లో తన పేరును నమోదు చేసుకుంది.
🇮🇳🥉 𝗔𝗡𝗢𝗧𝗛𝗘𝗥 𝗕𝗥𝗢𝗡𝗭𝗘 𝗙𝗢𝗥 𝗜𝗡𝗗𝗜𝗔! Many congratulations to Manu Bhaker and Sarabjot Singh on securing a superb Bronze for India in the mixed team 10m Air Pistol event.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 30, 2024
💪 A second Bronze for Manu Bhaker at #Paris2024, a terrific achievement.
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MjgiZBy03Y
తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు .
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల పట్టికలో మొన్నే మను భాకర్ ఖాతా తెరిచింది. జులై 28 ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. ఈ పతకంతో భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా కూడా ఇవాల్టి పతకంతోరికార్డు సృష్టించింది.
Also Read: భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడేశా, బోపన్న భావోద్వేగ ప్రకటన
నాలుగో రోజు భారత్ కు రెండో పతకం
జులై 30 మంగళవారం పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత్‌కు రెండో పతకం లభించింది. ఒలింపిక్స్ రెండో రోజే మను ద్వారా భారత్‌కు తొలి పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు కాంస్య పతకాలు మాత్రమే దక్కాయి. ఇప్పుడు భారత అథ్లెట్ల బంగారు పతకాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు - మను భాకర్ నయా హిస్టరీ- భారత్‌కు మరో మెడల్