Paris Olympics 2024: ఇక పోరాటం కాంస్యం కోసమే, సెమీఫైనల్లో భారత హాకీ జట్టు ఓటమి
Olympic Games Paris 2024: ఒలింపిక్స్‌లో మరోసారి భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. జర్మనీతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది.
Indian hockey team lost to Germany: ఒలింపిక్స్(Olympic Games Paris 2024)లో మరోసారి భారత్ కు మరోసారి నిరాశే ఎదురైంది. జర్మనీ(Germany)తో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. జర్మనీ-టీమిండియా గెలుపు కోసం చివరి వరకూ పోరాడడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. భారత్ తొలి గోల్ చేసి ఆధిక్యం సాధించగా.. ఆ తర్వాత వరుసగా రెండు గోల్స్ చేసిన జర్మనీ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత పెనాల్టీ కార్నర్ గోల్‌గా మలచిన భారత్ స్కోరును 2-2తో సమం చేసింది. ఆ తర్వాత మ్యాచ్ డ్రా దిశగా నడిచింది. అయితే భారత గోల్ పోస్ట్‌పై పదే పదే దాడులు చేసిన జర్మనీ ఫలితం రాబట్టింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా ఫీల్డ్ గోల్ సాధించి ఆధిక్యాన్ని 3-2కు పెంచింది. ఆ తర్వాత భారత్ పుంజుకున్నా ఫలితం దక్కలేదు. ఇక భారత్ మరోసారి కాంస్య పతకం కోసం పోరాడనుంది
HEARTBREAK FOR TEAM INDIA. 💔
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 6, 2024
- Indian hockey team lost to Germany in the Semi Finals at the Paris Olympics. 🥲 pic.twitter.com/rlY1IovzE4
We were so close to the Finals this time 🥹
— The Khel India (@TheKhelIndia) August 6, 2024
India lost 2-3 to Germany in the Semi Finals
Team India now will fight for the Bronze Medal pic.twitter.com/9OjKppRE3J