అన్వేషించండి

PM Modi: ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల మంది భారతీయుల కల- ప్రధాన మంత్రి మోడీ

ఒలింపిక్స్  క్రీడలు నిర్వహించడం 140 కోట్ల భారతీయుల కల అన్నారు ప్రధాన మంత్రి మోడీ. 40 ఏళ్ల విరామం తర్వాత ఐఓసీ సెషన్‌ను, భారత్‌లో నిర్వహించడం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు.

ఒలింపిక్స్  క్రీడలు నిర్వహించడం 140 కోట్ల భారతీయుల కల అన్నారు ప్రధాన మంత్రి మోడీ. 40 ఏళ్ల విరామం తర్వాత ఐఓసీ సెషన్‌ను, భారత్‌లో నిర్వహించడం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. 2036లో జరిగే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్డింగ్ వేస్తుందని మోడీ స్పష్టం చేశారు. ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాన్ని ప్రధాని ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఐఓసీ సెషన్‌ను భారత్‌లో నిర్వహించడం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. అహ్మదాబాద్‌లో పాకిస్తాన్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు టీమ్ ఇండియా శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు మన సంస్కృతి, జీవనశైలిలో ముఖ్యమైన భాగమన్న మోడీ,  క్రీడలు ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే భావనను బలపరుస్తున్నాయని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో క్రీడా కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ఏ అవకాశాన్ని వదులుకోం
సింధు నాగరికత నుంచి వేద యుగం వరకు, భారతదేశంలోని ప్రతి కాలంలో క్రీడల వారసత్వం సుసంపన్నంగా ఉందన్నారు మోడీ. ఇటీవలి  కాలంలో భారతదేశం ప్రధాన క్రీడా కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యాన్ని సంపాదించుకుందున్నారు. దేశంలో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తిగా ఉందని. 2036లో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహకంగా భారత్ ఎటువంటి అవకాశాన్ని వదులుకోదని స్పష్టం చేశారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 2036 ఒలింపిక్స్ కు ముందు 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం దేశం ఇవ్వాలనుకుంటోందని, ఐఓసీ నుంచి భారత్‌కు నిరంతరం మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని భారత్ వదిలిపెట్టదని మోడీ అన్నారు.

భారత్ పై థామస్ బాచ్ ప్రశంసలు
హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలలో భారత అథ్లెట్ల అద్భుతమైన ప్రదర్శన చేశారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రశంసలు కురిపించారు. పతకాల్లో సాధించడంలో గత రికార్డు బద్దలు కొట్టిన భారత్‌కు అభినందనలు తెలిపారు. ఇది భారత ఒలింపిక్ సంఘం గర్వించదగిన విషయమన్నారు. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్  క్రీడలు, ప్రీ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చివరివని స్పష్టం చేశారు. భారత్ లో ఐఓసీ సెషన్‌ను నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు థామస్ బాచ్.  అద్భుతమైన చరిత్ర, డైనమిక్ వర్తమానాన్ని భవిష్యత్తులో బలమైన విశ్వాసంతో మిళితం చేసే దేశమన్నారు. 

40 ఏళ్ల విరామం తర్వాత
40 ఏళ్ల విరామం తర్వాత భారత్ రెండోసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌కు ఆతిథ్యం ఇస్తోంది. 1983లో ఐఓసీ తన 86వ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించింది. సెషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుల ముఖ్యమైన సమావేశం. ఐఓసీ సెషన్లలో ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సెషన్‌లో ఐఓసీ సభ్యులు, ప్రముఖ భారతీయ క్రీడాకారులు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో సహా వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణే పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మరింత ఆదరణ లభిస్తుండటంతో 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌‌కు చోటు కల్పించింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
I Bomma: ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
Dulquer Salmaan Defender : దుల్కర్ సల్మాన్ ఎన్ని కోట్ల డిఫెండర్‌లో తిరుగుతున్నాడు? ఫీచర్స్ నుంచి పవర్ వరకు అన్నీ తెలుసుకోండి!
దుల్కర్ సల్మాన్ ఎన్ని కోట్ల డిఫెండర్‌లో తిరుగుతున్నాడు? ఫీచర్స్ నుంచి పవర్ వరకు అన్నీ తెలుసుకోండి!
Prabhas: ప్రభాస్‌ను సూపర్ స్టార్‌గా మార్చిన సినిమాలివే... 'ది రాజాసాబ్' కంటే ముందే వీటిని చూశారా?
ప్రభాస్‌ను సూపర్ స్టార్‌గా మార్చిన సినిమాలివే... 'ది రాజాసాబ్' కంటే ముందే వీటిని చూశారా?
Embed widget