Paris Olympics 2024: స్వర్ణ సంబరాలు నేడు ఖాయమేనా?,ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్ ఇదే
Olympic Games Paris 2024: 3వ రోజు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యంత కీలకం కానుంది. జావెలిన్ త్రో ఫైనల్లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా, కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు బరిలో దిగనున్నాయి
India at Olympics Day 13 schedule:విశ్వ క్రీడల్లో భారత్ మరో పతకం సాధిస్తుందా లేదా అన్నది ఈరోజు తేలనుంది. ఈ 13వ రోజు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యంత కీలకం కానుంది. కీలక పతాకాంశాల్లో నేడు భారత్ తలపడనుంది. జావెలిన్ త్రో ఫైనల్లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా బరిలోకి దిగుతున్నాడు.
జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో తన మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల దూరం నీరజ్ చోప్రా బల్లెన్ని విసిరాడు. మరే ఇతర జావెలిన్ త్రోయర్ కూడా నీరజ్‌ను అదిగమించలేకపోయాడు. దీంతో నీరజ్ ఈసారి పతకం తెస్తాడని భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్ అమీతుతీ తేల్చుకోనుంది. సెమీస్‌లో ఓడిపోయినా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న భారత హాకీ జట్టు కూడా పతకంపై ఆశలు రేపుతోంది. సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయినా భారత పురుషుల హాకీ జట్టు ఆటతీరు ఆకట్టుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సేన చివరి వరరకూ తీవ్రంగా పోరాడినా 2-3తో మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఈ కాంస్య పతక పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది.