అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: భారీ ఆశలు, ఆకాశాన్ని తాకే అంచనాలతో పారిస్ బరిలో దిగ్గజాలు
Olympic Games Paris 2024: నాలుగు రోజుల్లో ఆరంభం కానున్న విశ్వ క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన పది మంది దిగ్గజ ఆటగాళ్లు ఎవరంటే ..
10 biggest names to watch at Paris Olympics 2024: క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానున్నాయి. ఈసారి విశ్వ క్రీడల్లో తమ అథ్లెట్లు సత్తా చాటి పతక కలను నెరవేరుస్తారని అన్ని దేశాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు ఈ అంతర్జాతీయ క్రీడా వేదికపై దిగ్గజ ఆటగాళ్లు మెరుపులు చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఒలింపిక్స్‌లో 10,500 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన పది మంది దిగ్గజ ఆటగాళ్లు ఎవరు... వారిపై ఉన్న అంచనాలేంటో ఓసారి చూద్దామా..?
సిమోన్ బైల్స్
అమెరికాకు చెందిన దిగ్గజ అథ్లెట్లలో సిమోన్ బైల్స్ ముందు వరుసగా ఉంటుంది.
ఆల్ టైం దిగ్గజ జిమ్నాస్ట్‌లలో ఒకరిగా పరిగణిస్తున్న బైల్స్... ఈసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. నాలుగుసార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన బైల్స్.. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అనూహ్యంగా వైదొలిగింది. కానీ ఈసారి మాత్రం మరో స్వర్ణ పతకాన్ని ఒడిసి పట్టాలని పట్టుదలగా ఉంది.
రఫెల్ నాదల్
ఈ స్పెయిన్ బుల్ ఆట కోసం టెన్నిస్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కింగ్ ఆఫ్ క్లే కోర్టుగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే నాదల్ ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. సింగిల్స్‌లో స్వర్ణం నాదల్‌దేనని చాలామంది బలంగా విశ్వసిస్తున్నారు. నాదల్ 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన రికార్డు ఉంది. నాదల్
2008లో ఒలింపిక్ సింగిల్స్ గోల్డ్, 2016లో డబుల్స్ స్వర్ణం సాధించాడు.
షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్
జమైకన్ స్ప్రింటింగ్ క్వీన్ ఫ్రేజర్-ప్రైస్ అయిదోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. మహిళల 100 మీటర్ల రేసులో 37 ఏళ్ల ప్రైస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలతో సహా ఎనిమిది ఒలింపిక్ పతకాలను గెలిచి రికార్డు సృష్టించింది. పారిస్ 2024 తర్వాత రిటైర్ అవుతానని ఇప్పటికే ప్రకటించిన ప్రైస్ చివరి ఒలింపిక్స్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.
విక్టర్ వెంబన్యామ
ఫ్రాన్స్‌కు చెందిన వెంబన్యామా ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ఆటగాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల బాస్కెట్‌బాల్ టీంకు ప్రాతినిథ్యం వహించాడు. ఇతని ఆట కోసం ఫ్రాన్స్ మొత్తం ఎదురుచూస్తోందంటే అతిశయోక్తి కాదు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఫ్రాన్స్ ఓడిపోయింది. ఈసారి ఎలాగైన స్వర్ణం గెలవాలని ఫ్రాన్స్‌తో పాటు వెంబన్యామ పట్టుదలగా ఉన్నాడు. 7 అడుగుల 4 అంగుళాల పొడవున్న వెంబన్యామా ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.
కేలెబ్ డ్రెస్సెల్
అమెరికాకు చెందిన కేలెబ్ డ్రెస్సెల్ స్టార్ స్విమ్మర్‌గా గుర్తింపు పొందాడు. డ్రెస్సెల్ 2021 టోక్యో గేమ్స్‌లో ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. 2022లో మానసిక ఆరోగ్యం బాలేదని అకస్మాత్తుగా వైదొలిగి స్విమ్మింగ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు. తర్వాత మళ్లీ స్విమ్మింగ్‌లోకి వచ్చేశాడు.
ఎలియడ్ కిప్చోగే
పారిస్ క్రీడల్లో కెన్యాకు చెందిన ఎలియుడ్ కిప్‌చోగ్ వరుసగా మూడో ఒలింపిక్ మారథాన్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్నాడు. 2024 టోక్యో మారథాన్‌లో కిప్చోగే నిరాశపరిచాడు. 39 ఏళ్ల కిప్చోగే 42.2కిలోమీటర్ల మారథాన్ దూరాన్ని రెండు గంటలలోపు అధిగమించి చరిత్ర సృష్టించాడు.
లెబ్రాన్ జేమ్స్
అమెరికాకు చెందిన 40 ఏళ్లు దాటిన లెబ్రాన్ జేమ్స్ నాలుగోసారి అమెరికా బాస్కెట్‌బాల్ జట్టు తరపున ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్నాడు. మూడు దశాబ్దాల పాటు ఒలింపిక్స్‌లో పోటీపడిన మొదటి అమెరికా పురుషుల బాస్కెట్‌బాల్ ఆటగాడిగా జేమ్స్ రికార్డు సృష్టించనున్నాడు. గతంలో మూడుసార్లు ఒలింపిక్ బంగారు పతకాలు గెలిచిన జట్టులో జేమ్స్ సభ్యుడిగా ఉన్నాడు.
కేటీ లెడెకీ
అమెరికాకు చెందిన లెడెకీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 200m, 400m, 800m, 1,500m ఫ్రీస్టైల్‌లో అర్హత సాధించింది. ఏడు ఒలింపిక్ బంగారు పతకాలు, 21 ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లతో లెడెకీ దిగ్గజ అథ్లెట్‌గా ఖ్యాతి గడించింది.
నవోమి ఒసాకా
జపాన్ సూపర్ స్టార్ నవోమి ఒసాకా పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించింది. బిడ్డ పుట్టిన కారణంగా 15 నెలల విరామం తీసుకున్న తర్వాత ఈ ఏడాది మళ్లీ తిరిగి వచ్చింది. టోక్యో గేమ్స్‌లో సింగిల్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన ఒసాకా..ఈసారి మహిళల సింగిల్స్ టెన్నీస్‌లో పతకం సాధించాలని పట్టుదలగా ఉంది.
స్కై బ్రౌన్
టోక్యోలో జరిగిన మహిళల పార్క్ స్కేట్‌బోర్డింగ్ ఈవెంట్‌లో సంచలన ప్రదర్శనతో 13 ఏళ్ల వయసులోనే స్కై బ్రౌన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. బ్రిటన్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కులైన ఒలింపిక్ పతక విజేతగా అవతరించింది. పారిస్ ఒలింపిక్స్‌లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
కరీంనగర్
అమరావతి
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement