NZ vs AUS, T20 WC LIVE: 18.5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 173-2, ఎనిమిది వికెట్లతో విజయం
T20 WC 2021, Match 45, NZ vs AUS: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో నేడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
LIVE
Background
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తుదిపోరుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని రెండు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు కావడం.. నాణ్యమైన క్రికెట్ ఆడటంలో ముందుంటారు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. వాస్తవంగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఫైనల్లో తలపడతాయని అంతా అంచనా వేశారు.
భీకరమైన ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఆఖరి వరకు నమ్మకంగా ఆడిన జిమ్మీ నీషమ్ సెమీస్ గెలిపించేశాడు. ఇక పాక్‌పై ఆసీస్‌దీ అద్భుతమైన గెలుపే. భీకరమైన పేస్‌తో బౌలింగ్ చేస్తున్న షాహిన్ అఫ్రిది వేసిన 19 ఓవర్ ఆఖరి మూడు బంతుల్ని మాథ్యూవేడ్ సిక్సర్లుగా మలిచాడు. కంగారూలను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. న్యూజిలాండ్ 5, ఆస్ట్రేలియా 9 గెలిచాయి. స్పష్టమైన ఆధిక్యం కంగారూలకే ఉన్నా.. టీ20 ప్రపంచకప్పుల్లో తలపడ్డ ఒక మ్యాచులో కివీస్‌దే గెలుపు. దుబాయ్‌లో ఎండకాసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 26 నుంచి 29 డిగ్రీ మధ్య ఉండనుంది. క్రికెట్ ఆడేందుకు అనుకూలమైన వాతావరణమే ఉండనుంది.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అతడు మరో 30 పరుగులు చేస్తే మాథ్యూ హెడేన్ రికార్డును బద్దలు కొడతాడు. ఒక పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ ఆటగాడిగా నిలుస్తాడు. 2007లో అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌లో మాథ్యూ హెడేన్ 265 పరుగులు చేశాడు. ఆ తర్వాత షేన్ వాట్సన్ 2012లో 249 పరుగులతో అతడి వెనకాలే నిలిచాడు. అప్పటి నుంచి టీ20ల్లో మరే ఆసీస్ ఆటగాడూ వీరి రికార్డులకు చేరువ కాలేదు. ఇన్నాళ్లకు డేవిడ్ వార్నర్ ముంగిట ఆ అవకాశం నిలిచింది.
గాయం తర్వాత జట్టులోకి వచ్చిన వార్నర్ ఏమంత ఫామ్‌లో లేడు. ఐపీఎల్ 2021లోనూ అంతగా రాణించలేదు. కొన్ని మ్యాచుల్లో తుది జట్టులోకీ ఎంపిక కాలేదు. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం అతడు ఫామ్‌లోకి వచ్చాడు. ఆరు మ్యాచుల్లోనే 47 సగటు 159 స్ట్రైక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్థానంలో ఉన్న ఆరోన్ ఫించ్ చేసింది 130 పరుగులే కావడం గమనార్హం. అయితే ఒకప్పటిలా డేవిడ్ వార్నర్ కేవలం బాదుడు మంత్రం పఠించడం లేదు. మ్యాచులను అంచనా వేస్తున్నాడు. పిచ్‌లను అర్థం చేసుకుంటున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదడం తక్కువ చేశాడు. చక్కని బంతుల్ని గౌరవిస్తున్నాడు. తన ఆటతీరును మార్చుకున్నాడు. ధనాధన్ పరుగులు చేయకుండా జట్టుకు విజయాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అవసరమైనప్పుడు ఆచితూచి ఆడుతూ.. సందర్భం దొరగ్గానే దంచికొడుతున్నాడు.
18.5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 173-2, ఎనిమిది వికెట్లతో విజయం
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆసీస్
మిషెల్ మార్ష్ 77(50)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 28(18)
టిమ్ సౌతీ 3.5-0-43-0
18 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 162-2, లక్ష్యం 173 పరుగులు
ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియా విజయానికి 12 బంతుల్లో 11 పరుగులు కావాలి.
మిషెల్ మార్ష్ 71(47)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23(16)
ఆడం మిల్నే 4-0-30-0
17 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 159-2, లక్ష్యం 173 పరుగులు
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియా విజయానికి 18 బంతుల్లో 14 పరుగులు కావాలి.
మిషెల్ మార్ష్ 69(44)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 22(13)
ట్రెంట్ బౌల్ట్ 4-0-18-2
16 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 149-2, లక్ష్యం 173 పరుగులు
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియా విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు కావాలి.
మిషెల్ మార్ష్ 61(40)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 21(11)
టిమ్ సౌతీ 3-0-32-0
15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 136-2, లక్ష్యం 173 పరుగులు
ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియా విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి.
మిషెల్ మార్ష్ 61(38)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10(7)
ఆడం మిల్నే 3-0-27-0