Neeraj Chopra: గాయం వేధిస్తున్నా నీరజ్ 'డైమండ్"ను వదల్లేదు
Neeraj Chopra : పక్క గాయం వేధిస్తున్నా భారత స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా నీరజ్ సత్తా చాటాడు. లుసానె డైమండ్ లీగ్ లో ఈటెను 89.49 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
Neeraj Chopra Lausanne Diamond League 2024: పారిస్ ఒలింపిక్స్(Paris olympics)లో వరుసగా రెండోసారి భారత్(Bharat)కు పతకం అందించి మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ జావెలిన్ త్రోయర్.. నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. 2022లో జరిగిన డైమండ్ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నీరజ్..ఈసారి రెండో స్థానంతో లుసానె డైమండ్ లీగ్‌ను రెండో స్థానంతో ముగించాడు. చివరి ప్రయత్నంలో ఈటెను 89.49 మీటర్ల దూరం విసిరి నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. అప్పటివరకూ టాప్ త్రీలో కూడా లేని చివరి త్రోలో మాత్రం అద్భుతం చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చేసిన ప్రదర్శన కంటే ఇదే అత్యుత్తమం కావడం గమనార్హం. తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 82.10 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా... ఆ తర్వాత నాలుగు ప్రయత్నాల్లోనూ కనీసం 86 మీటర్ల దూరం దాటలేకపోయారు. దీంతో డైమండ్ లీగ్‌లో భారత్‌కు నిరాశ తప్పదని అంతా భావించారు. కానీ చివరి ప్రయత్నంలో నీరజ్ ఈటెను 89.49 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ కెరీర్‌లోనే ఈ ప్రదర్శన ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. డైమండ్ లీగ్ 2022లో నీరజ్ జావెలిన్‌ను 89.94 మీటర్లు విసిరాడు. నీరజ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.