Mohammad Hafeez Retirement: 32 MOM అవార్డులు అందుకున్న హఫీజ్ వీడ్కోలు.. వయసు 41
మహ్మద్ హఫీజ్ 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 12,780 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 2003లో జింబాబ్వేపై వన్డే ఆడటంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో ఓడిపోయిన సెమీఫైనల్ మ్యాచ్ ఆఖరిది. ప్రస్తుతం అతడి వయసు 41 ఏళ్లు.
జాతీయ జట్టుకు టాప్ ఆర్డర్లో హఫీజ్ పరుగుల వరద పారించాడు. అంతేకాకుండా ఆఫ్ స్పిన్నర్‌గా సేవలందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా పీఎస్‌ఎల్‌లో లాహోర్ ఖలందర్స్‌కు ఆడనున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగులకు అందుబాటులో ఉండనున్నాడు.
కెరీర్లో హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 12,780 పరుగులు చేశాడు. 32 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్నాడు. షాహిద్ అఫ్రిది (43), వసీమ్ అక్రమ్ (39), ఇంజమామ్ (33) మాత్రమే అతడికన్నా ఎక్కువసార్లు ఈ అవార్డు అందుకున్నారు.
2018, డిసెంబర్‌లో హఫీజ్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సెలక్టర్ల కోరిక మేరకు 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డేలకు దూరమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2020 తర్వాత పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. టోర్నీ ఒక ఏడాది వాయిదా పడటంతో రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకున్నాడు. సోమవారం మీడియా సమావేశంలో నిర్ణయం ప్రకటించాడు. పాక్ తరఫున అత్యధిక టీ20 ప్రపంచకప్‌లు ఆడిన క్రికెటర్ అతడే కావడం గమనార్హం. కెప్టెన్సీ కూడా చేశాడు.
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు