News
News
X

MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది.

FOLLOW US: 
Share:

Mumbai Indians Women vs Royal Challengers Bangalore Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొమ్మిది వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు సాధించి ఘనవిజయం సాధించింది. టోర్నీలో ముంబైకి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి. 

వికెట్ తీయడమే పాపం అయిపోయింది
156 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌కు ఇన్నింగ్స్‌కు సూపర్ స్టార్ట్ దొరికింది. ఓపెనర్లు హీలీ మాథ్యూస్ (77 నాటౌట్: 38 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్), యస్తికా భాటియా (23: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మొదటి వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. అనంతరం యస్తికా భాటియా అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. దీంతో ఆల్ రౌండర్ నటాలీ స్కీవర్ బ్రంట్ క్రీజులోకి వచ్చింది.

కానీ తను వచ్చిన తర్వాత బెంగళూరు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది. హీలీ మాథ్యూస్, నటాలీ స్కీవర్ బ్రంట్ (55 నాటౌట్: 29 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్) దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి జోడిని విడగొట్టడానికి బెంగళూరు కెప్టెన్ స్మృతి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. వీరు రెండో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించారు. కేవలం 56 బంతుల్లోనే వీరు ఈ పరుగులను జోడించారు. దీంతో బెంగళూరు 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బౌలర్లలో కేవలం ప్రీతికి మాత్రమే ఒక్క వికెట్ దక్కింది.

43 పరుగులకే నాలుగు వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23: 17 బంతుల్లో, ఐదు ఫోర్లు), సోఫీ డివైన్ (16: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. అయితే అక్కడ బెంగళూరు టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డు మీద 43 పరుగులు చేరేసరికి నలుగురు బెంగళూరు బ్యాటర్లు పెవిలియన్ చేరుకున్నారు.

ఆ తర్వాత మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు బెంగళూరును ఆదుకున్నారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు అందరూ కనీసం 20 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రిచా ఘోష్ (28: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), కనికా అహూజా (22: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), శ్రేయాంక పాటిల్ (23: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు), మేగాన్ షుట్ (20: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) బ్యాట్‌తో విలువైన పరుగులు జోడించారు.

బెంగళూరు బౌలర్లలో హీలీ మాథ్యూస్ మూడు వికెట్లు తీసింది. అమీలియా కెర్, సైకా ఇషాక్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. నాట్ స్కీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీసుకున్నారు.

Published at : 06 Mar 2023 10:54 PM (IST) Tags: WPL 2023 Mumbai Indians Women MIW vs RCBW royal challengers bangalore women MIW Vs RCBW Highlights

సంబంధిత కథనాలు

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్‌ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?

RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్‌ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి