By: ABP Desam | Updated at : 30 Oct 2021 10:11 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
కారుతో పాటు బహుమతిని కూడా అందుకుంటున్న సుమిత్ అంటిల్
టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్‌కు మహీంద్రా ఎక్స్‌యూవీ700 గోల్డ్ ఎడిషన్‌ను గిఫ్ట్‌గా అందించింది. సుమిత్ అంటిల్ ఎఫ్64 పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని సాధించాడు. తనకు బహుమతిగా అందించింది ఒక ప్రత్యేకమైన ఎక్స్‌యూవీ700. లోపలా, బయటా మిడ్‌నైట్ బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఉండనుంది.
బంగారు పతకం సాధించడానికి సుమిత్ 68.55 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. దాన్ని ముందు డ్యాష్ బోర్డు మీద, కారు వెనకభాగంలో, ఆరు హెడ్ రెస్ట్‌ల మీద ప్రింట్ వేయించారు. ఇందులో కస్టం గ్రిల్‌ను అందించారు. వీటిలో నిలువుగా ఉన్న స్లాట్లకు బంగారు పూత పూయడం విశేషం.
అలాగే ఇందులో మహీంద్రా లోగోకు కూడా బంగారు పూత పూశారు. సీట్ల మీద, ఐపీ ప్యానెల్ మీద కూడా గోల్డ్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్‌యూవీ700 తర్వాత ఆరు నెలల వరకు పూర్తిగా అమ్ముడుపోయింది. సెకండ్ బ్యాచ్‌లో రెండు గంటల్లోనే 25 వేల బుకింగ్స్ జరగడం విశేషం.
ఈ ఎస్‌యూవీ ధర కూడా ఇటీవలే పెరిగింది. దీంతో దీని ధర రూ.12.99 లక్షల నుంచి రూ.22.99 లక్షల వరకు ఉంది. దాదాపు రూ.50 వేల వరకు దీని ధరను పెంచారు. పెట్రోల్ వేరియంట్‌లో 200 పీఎస్ 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను, డీజిల్ వేరియంట్‌లో 155పీఎస్/185పీఎస్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందించారు.
ఈ రెండిట్లోనూ 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్లను ముందు డెలివరీ చేస్తారు. ఆ తర్వాత డీజిల్ వేరియంట్ల డెలివరీ ఉంటుంది. 2022 జనవరి 15వ తేదీ నాటికి 14 వేల కార్లను డెలివరీ చేయాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
Team India New Jersey: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచే కొత్త జెర్సీలు - ఘనంగా ఆవిష్కరించిన అడిడాస్
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?