By: ABP Desam | Updated at : 27 Mar 2023 08:19 PM (IST)
మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)
IPL 2023 Latest Updates: IPL 2023 కోసం అభిమానులతో పాటు జట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ మార్చి 31వ తేదీ నుండి ప్రారంభం కానుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సహా అన్ని జట్లూ తమ కెప్టెన్లను ప్రకటించాయి. నిజానికి రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఆటగాళ్లు తమ తమ జట్లకు కెప్టెన్‌గా కొనసాగుతారు.
అదే సమయంలో IPL 2023లో చాలా జట్ల కెప్టెన్లు మారడం చూడవచ్చు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించనున్నాడు.
హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అంతకుముందు ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ 2022 గుజరాత్ టైటాన్స్‌కు మొదటి సీజన్. ఫాఫ్ డు ప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ 2022లో కూడా ఫాఫ్ డు ప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ కేఎల్ రాహుల్ చేతిలో ఉంటుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2023కి తన కెప్టెన్‌గా నితీష్ రాణాను నియమించింది. వాస్తవానికి శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. దీని కారణంగా అతను ఐపీఎల్ 2023లో ఆడలేడు. అందుకని కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నితీష్ రాణాను కెప్టెన్‌గా చేసింది. పంజాబ్ కింగ్స్ పగ్గాలు శిఖర్ ధావన్ చేతిలో ఉన్నాయి. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇక డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
ఐపీఎల్ 16వ సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా కేకేఆర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో నైట్‌రైడర్స్‌తో గత కొన్నాళ్లుగా అనుబంధం ఉన్న నితీష్ రాణా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగం కాలేడు.
నితీష్ రాణా 2018 నుంచి కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు. నితీష్ రాణా కంటే ముందు శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ పేర్లు కూడా కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా వినిపించాయి. అయితే భారత బ్యాట్స్‌మెన్ నితీష్ రాణాపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఫ్రాంచైజీ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్‌లో నితీష్ రాణా జట్టుకు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు తనకు కెప్టెన్సీ అనుభవం లేదు.
బ్యాట్స్‌మెన్‌గా ఐపీఎల్‌లో నితీష్ రాణా రికార్డు మెరుగ్గా ఉంది. నితీష్ రాణా 2016లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. తన రెండో సీజన్ లోనే నితీష్ రాణా 300కి పైగా పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే 2018 వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ నితీష్ రాణాతో ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి నితీష్ రాణా ఈ ఫ్రాంచైజీ కోసం ఐదు సీజన్లు ఆడాడు.
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?
SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం
WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కామెంటేటర్‌గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే
WTC Final 2023: భరత్ vs కిషన్ - టీమ్‌ఇండియాకు పెద్ద చిక్కే వచ్చిందే!
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం